క్రాక్..రవితేజ హీరోగా టాగోర్ మధు నిర్మిస్తున్న సినిమా. వరుస ఫ్లాపుల్లో వున్న రవితేజను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చే సినిమా అన్న బజ్ వుంది. ఆ బజ్ ను మరింత పెంచేలాగే వుంది ఈ రోజు విడుదల చేసిన టీజర్. ఒంగోలు లాంటి కోస్టల్ ఏరియాలో మైనింగ్ మాఫియా నేపథ్యంలో కథ తయారు చేసినట్లు ఈ 71 సెకెండ్ల టీజర్ చెప్పేసింది. ఓ మాస్ హీరో తో తీసే భారీ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్ లు అన్నీ జోడించినట్లు క్లియర్ గా తెలుస్తోంది.
టీజర్ అయినా చిన్నగా వదిలేయకుండా, ప్రతి ఒక్క ఐటమ్ టచ్ చేసారు. హీరోయిజం, మాస్ ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్, విజువల్ గ్రాండీ ఇలా ప్రతి ఒక్కటీ టచ్ చేసుకుంటూ టీజర్ ను కట్ చేయడం విశేషం. రవితేజ సినిమా సరైనది వచ్చి చాలా కాలం అయింది. రవితేజలోని కామెడీ యాంగిల్ చూపించడంతో సరిపోయింది. కానీ క్రాక్ లో టోటల్ ప్యాకేజ్ లా అన్ని యాంగిల్స్ టచ్ చేసినట్లు క్లియర్ గా కనిపిస్తోంది.
హిట్ లైన్ లో వున్న థమన్ ఇచ్చిన ఆర్ఆర్ టీజర్ కు అడిషనల్ ప్లస్ పాయింట్.