Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్రాక్ స్టయిల్ లోనే జై బాలయ్య

క్రాక్ స్టయిల్ లోనే జై బాలయ్య

మైత్రీ మూవీస్ బాలకృష్ణ హీరోగా నిర్మిస్తున్న చిత్రం జై బాలయ్య. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఓ లెవెల్ లో వుంటాయట. సినిమా పక్కా బాలయ్య చేసిన చెన్నకేశవరెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమాల తరహాలోనే వుంటుందని తెలుస్తోంది. 

తెలుగు తెరమీద ఈ మధ్య ఫ్యాక్షన్ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే మళ్లీ ఆ జానర్ లోనే అప్పట్లో వచ్చిన అన్న, చెల్లి, బావ, పగలు ప్రతీకారాలు, పిల్లల్ని ఎవరికీ తెలియకుండా విదేశాల్లో పెంచడం ఇలాంటి పాయింట్లతోనే స్టోరీ అల్లుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలయ్య డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో తొలిసగంలోనే మూడు భారీ ఫైట్లు వుంటాయట. వాటిల్లో ఒకటి విదేశాల్లో భారీగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సీన్ అమెరికాలో చేయాల్సి వుంటుంది. కానీ వీలు కాకపోతే మరో దేశంలో షూట్ చేసి, అమెరికా అంటారన్న మాట. 

సాధారణంగా ఫ్యాక్షనిస్ట్ ఫైట్లు అంటే కత్తులు, గొడ్డళ్లు వాడతారు. విదేశాల్లో అయితే తుపాకులు వాడతారు. కానీ ఈ సినిమాలో విదేశాల్లో ఫ్యాక్షనిస్ట్ ఫైట్ అన్నది స్పెషాలిటీ అని టాక్.

బాలయ్య సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాలో కథ, కన్నా ఎలివేషన్లు, ఫైట్లు వీటికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుందని తెలుస్తోంది. క్రాక్ సినిమాలో కూడా ప్రతి సీన్ కు ఎలివేషన్, ప్రతి ఫైట్ కు ఎలివేషన్ వంటి టెక్నిక్ వాడారు. ఇందులోనూ అదే టెక్నిక్ ను వాడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?