క్రేజీ మూవీస్.. షూటింగ్ అప్ డేట్స్

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో బన్నీపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. Advertisement…

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో బన్నీపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మొన్నటివరకు నానక్ రామ్ గూడలో షూట్ చేశారు. ఆ తర్వాత ఛార్మినార్ లో షూట్ చేశారు. ఇప్పుడు వైజాగ్ లో షూట్ చేస్తున్నారు. ఇదంతా ఓ మాంటేజ్ సాంగ్ కోసం జరుగుతున్న షూట్.

ఇక భోళాశంకర్ షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో ఓ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సెట్ లోనే 200 డాన్సర్లతో చిరంజీవిపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. కీర్తిసురేష్ కూడా ఈ షూట్ లో పాల్గొంటోంది.

మహేష్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలోని జన్వాడ అనే గ్రామంలో భారీ ఇంటి సెట్ వేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. విదేశాల్లో ఉన్న మహేష్ మరో 2 రోజుల్లో తిరిగొస్తున్నాడు. ఆ వెంటనే ఈ సెట్ లో షూట్ స్టార్ట్ అవుతుంది. మేజర్ పార్ట్ షూటింగ్ ఇందులోనే.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్-కె, నాగచైతన్య కస్టడీ సినిమాల షూటింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.