వారం గడిచింది.. భారీ నష్టం మిగిల్చింది

నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా థియేటర్లలోకొచ్చి వారం పూర్తయింది. ఈ వారం రోజుల్లో బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ సినిమా. నిన్నటి వసూళ్లతో కలిపి, కస్టడీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో…

నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా థియేటర్లలోకొచ్చి వారం పూర్తయింది. ఈ వారం రోజుల్లో బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ సినిమా. నిన్నటి వసూళ్లతో కలిపి, కస్టడీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా 6 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఆంధ్రా, సీడెడ్, నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే.. కస్టడీ మూవీ 50శాతం కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. వారం రోజులకి 50శాతం కూడా బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే ఇక కోలుకోవడం కష్టమనే సంగతి తెలిసిందే.

రిలీజైన మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది కస్టడీ సినిమా. కానీ రెండో రోజుకు టాక్ మారుతుందని, సినిమా పుంజుకుంటుందని యూనిట్ ఆశగా ఎదురుచూసింది. కానీ అలాంటి అద్భుతాలేం జరగలేదు. రోజురోజుకు కస్టడీ ఆక్యుపెన్సీ పడిపోయింది, కలెక్షన్లు క్షీణించాయి.

నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరక్ట్ చేశారు. కృతిశెట్టి హీరోగా నటించగా.. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించారు. బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. ఇలా సెటప్ అంతా బాగానే కుదిరినప్పటికీ మూవీ రిజల్ట్ తేడా కొట్టింది.