దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం సల్మాన్ నటించిన దబంగ్-3 సినిమాపై కూడా పడింది. మొదటి రోజు వసూళ్లలో రికార్డులు సృష్టిస్తుందనుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాబట్టలేకపోయింది.
దబంగ్ 3 సినిమాకు మొదటి రోజు దేశవ్యాప్తంగా (అన్ని భాషలు కలుపుకొని) 24 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ వచ్చింది. కనీసం 30 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని ట్రేడ్ భావించగా.. అంచనాకు 6 కోట్ల రూపాయలు తక్కువగా వసూళ్లు వచ్చాయి. దీనికి కారణం సీఏఏ నిరసనలు మాత్రమే.
మొదటి రోజు వసూళ్లలో సల్మాన్ కు చెక్కుచెదరని రికార్డులున్నాయి. అతడు నటించిన భారత్ సినిమాకు మొదటి రోజు ఏకంగా 42 కోట్ల 30 లక్షల రూపాయల నెట్ వచ్చింది. టైగర్ జిందా హై (రూ. 34.10 కోట్లు), సుల్తాన్ (రూ. 36.54 కోట్లు), ప్రేమ్ రథన్ ధన్ పాయో (రూ. 40.35 కోట్లు) సినిమాలు తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించాయి. వాటితో పోలిస్తే.. భారీ అంచనాల మధ్య వచ్చిన దబంగ్ సిరీస్ కచ్చితంగా భారీ వసూళ్లు రాబట్టాలి. కానీ అలా జరగలేదు.
సినిమాపై క్రిటిక్స్ పెద్దగా పాటిజివ్ గా స్పందించనప్పటికీ.. పాటిజివ్ టాక్ బాగానే నడుస్తోంది. సల్మాన్ డై-హార్డ్ ఫ్యాన్స్ కు సినిమా పిచ్చపిచ్చగా నచ్చుతుంది. సో.. వీకెండ్ గడిచేనాటికి (ఫస్ట్ వీకెండ్) ఈ సినిమా కచ్చితంగా రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ భావిస్తోంది.