నిర్మాత దానయ్య చాలా తెలివిగా, చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా అలాగే సాధ్యమైంది. ఇప్పుడు ఈ ముందుచూపుతోనే ఓ డీల్ ను క్లోజ్ చేసారు.
శిరీష్ రెడ్డి-దిల్ రాజుల ఎస్ వి సి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, నాని హీరోగా తను నిర్మిస్తున్న సరిపోదా శనివారం సినిమాను హోల్ సేల్ గా ఇచ్చేసారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాలకు గాను 25 కోట్లకు శిరీష్ రెడ్డి-దిల్ రాజులకు అందించేసారు.
తను రిటైల్ గా అమ్మడం పెద్ద కష్టం కాదు. కానీ లాస్ట్ మినిట్ లో డబ్బులు తక్కువ కట్టడం, జిఎస్టీలు ఇవ్వకపోవడం వంటి తలకాయనొప్పులు చాలా వున్నాయి. అదే శిరీష్ రెడ్డి-దిల్ రాజు అయితే వాళ్ల రెగ్యులర్ బయ్యర్లు వుంటారు. వాళ్లు వాళ్లు చూసుకుంటారు. పైగా ఇది మంచి రేటు కూడా. ఎందుకంటే నాని మార్కెట్ ఏమంత బాగా లేదు. వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో నాని రెండో సినిమా ఇది.
ఈ సినిమా ఫుల్ యాక్షన్ సినిమా. దాదాపు వంద కోట్లు ఖర్చు అవుతోందని అంచనా. అదే నిజమైతే నాని సినిమాల్లో అత్యంత భారీ సినిమా ఇదే అవుతుంది.