నిర్మాత కొడుకు ఇలా.. దర్శకుడి కొడుకు అలా!

బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. కాలం కూడా కలిసిరావాలి. టైమ్ బాగా లేకపోతే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇద్దరు హీరోల విషయంలో అదే జరిగింది. టైమ్ కలిసిరాక ఒకరు…

బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. కాలం కూడా కలిసిరావాలి. టైమ్ బాగా లేకపోతే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇద్దరు హీరోల విషయంలో అదే జరిగింది. టైమ్ కలిసిరాక ఒకరు సిల్వర్ స్క్రీన్ పైకి రాలేకపోయారు, మరొకరు మాత్రం గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వాళ్లే నిర్మాత దానయ్య కొడుకు, దర్శకుడు సతీష్ వేగేశ్న కొడుకు.

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం తీసి, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ, మంచి జోష్ మీదున్న నిర్మాత దానయ్య.. అదే ఊపులో తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్యాణ్ దాసరి, అధీర అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు గ్రాండ్ గా పరిచయం కాబోతున్నాడు.

తన కొడుకు డెబ్యూ కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ ను తీసుకొచ్చాడు దానయ్య. అధీర పోస్టర్ ను దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా రిలీజ్ చేశారు. అలా కల్యాణ్ దాసరి ఎంట్రీకి గ్రాండ్ ప్రమోషన్ దక్కింది.

మరోవైపు సతీష్ వేగేశ్న కొడుకు సమీర్ మాత్రం సిల్వర్ స్క్రీన్ పైకి రాలేకపోయాడు. కొడుకును హీరోగా పెట్టి కోతికొమ్మచ్చి అనే సినిమాను తీశాడు సతీష్ వేగేశ్న. సినిమా షూటింగ్ అయితే పూర్తయింది కానీ ఇప్పటివరకు అది రిలీజ్ కాలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో పడింది. దీంతో ఆ సినిమాను పక్కనపెట్టి, సమీర్ తో ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు వేగేశ్న.

కథలు అనే వెబ్ సిరీస్ తీస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఈ అంథాలజీ వెబ్ సిరీస్ లో పడవ అనే స్టోరీలో సమీర్ వేగేశ్న లీడ్ రోల్ చేస్తున్నాడు. కోతికొమ్మచ్చి సినిమా కంటే ముందు ఈ వెబ్ సిరీసే స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఇలా దానయ్య కొడుకు సిల్వర్ స్క్రీన్ పైకి గ్రాండ్ గా వస్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా సతీష్ వేగేశ్న కొడుకు, సిల్వర్ స్క్రీన్ వదిలేసి ఓటీటీ డెబ్యూ ఇవ్వాల్సి వస్తోంది. టైమ్ బాగాలేకపోతే అంతే.