కీరవాణి చేతిలో బింబిసార

ఎంత మంచి వాడవురా డిజాస్టర్ తరువాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా రాలేదు హీరో కళ్యాణ్ రామ్ నుంచి. బింబిసార సినిమా ను రెడీ చేసి పెట్టుకుని చాలా కాలం అయింది. కానీ ఇంకా…

ఎంత మంచి వాడవురా డిజాస్టర్ తరువాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా రాలేదు హీరో కళ్యాణ్ రామ్ నుంచి. బింబిసార సినిమా ను రెడీ చేసి పెట్టుకుని చాలా కాలం అయింది. కానీ ఇంకా డేట్ సెట్ కావడం లేదు. డిసెంబర్ లో విడుదల అని వినిపించింది. ఏప్రిల్ వచ్చేస్తోంది. 

ఈ భారీ సినిమాకు డైరక్టర్ ఆఫ్ మ్యూజిక్ అని సంతోష్ నారాయణన్ పేరు వేసారు టీజర్ లో. పాటలు చిరంతన్ భట్ అని మరో పేరు యాడ్ చేసారు. ఇప్పటి వరకు ఒక పాట కూడా వదలలేదు. 

ఇదిలా వుంటే ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్ మెంట్ కు కీరవాణి పేరు కూడా యాడ్ అయినట్లు బోగట్టా.

మగధీర టైపు హిస్టారికల్ సోషియో ఫాంటసీ సినిమా అయిన బింబిసార కు కీరవాణి చేత ఒక పాట, రీ రికార్డింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అది పూర్తయితే కానీ సినిమా విడుదలకు రెడీ అయినట్లు కాదు. 

ఇదిలా వుంటే బింబిసార రెండో భాగం కూడా ప్లానింగ్ వుంది. పార్ట్ వన్ విడుదలయిన తరువాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు.