దర్శకుడు బాబీపై ఫీలవుతున్న మైత్రీ!

దర్శకుడు బాబీ సితార బ్యానర్ లో బాలయ్య సినిమా చేయబోతున్నారన్న వార్తలు బయటకు రావడంతో మైత్రీ సంస్థ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.  Advertisement బాబీని తాము ఎంతో బాగా చూసుకున్నామని, మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య కు…

దర్శకుడు బాబీ సితార బ్యానర్ లో బాలయ్య సినిమా చేయబోతున్నారన్న వార్తలు బయటకు రావడంతో మైత్రీ సంస్థ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. 

బాబీని తాము ఎంతో బాగా చూసుకున్నామని, మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య కు ఎంత ఖర్చు చేయించినా, ఎదురు మాట్లాడలేదని అలాంటిది ఇప్పుడు తమను వదిలి సితార సంస్థకు వెళ్లిపోవడం ఏమిటి అని మైత్రీ అధినేతలు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

అదృష్టం బాగుండి వాల్తేర్ వీరయ్య హిట్ అయింది..డబ్బులు రికవరీ అయ్యాయి. లేకుంటే పరిస్థితి ఏమిటి అని, ఓవర్ బడ్జెట్ అవుతోందని తెలిసి కూడా తాము బాబీ విషయంలో అస్సలు మాట్లాడకుండా సినిమా కంప్లీట్ చేసామని మైత్రీ అధినేతలు తమ సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. 

ఆ కథ ఏదో తమకే ఇస్తే, బాలయ్యతో తామే సినిమా చేసే వాళ్లం కదా? కనీసం ఓ మాట అన్నా చెప్పలేదని వారు బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. బాబీ అడిగి వుంటే బాలయ్యను తాము కూడా ఒప్పించి డేట్ లు తీసుకునేవారం కదా అని అంటున్నట్లు బోగట్టా.

అయితే బాబీ ఈ విషయంలో మొదటి నుంచీ క్లారిటీగా వుంటున్నట్లు తెలుస్తోంది. తనకు ఎవరి అడ్వాన్స్ లూ వద్దు అని, ఎవరు హీరోను తీసుకువస్తే వారికి సినిమా చేస్తానని అంటూ, అదే విధంగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. 

సరే బాబీ కోసం మైత్రీ-సితార పోటీ పడడం సరే, వెంకీ మామ‌ డిజాస్టర్ తరువాత పీపుల్స్ మీడియాకు మరో సినిమా చేస్తాననే మాట బాబీ ఇచ్చారని, అది కూడా మరిచిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.