హాస్పిటల్ లో దర్శన్.. ఇటు పవిత్ర?

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఏ-2 అయితే, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ ఏ-1 నిందితురాలు. జూన్ 11 నుంచి వీళ్లిద్దరూ జైళ్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా దర్శన్ కు…

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఏ-2 అయితే, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ ఏ-1 నిందితురాలు. జూన్ 11 నుంచి వీళ్లిద్దరూ జైళ్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా దర్శన్ కు బెయిల్ వచ్చింది. మరి పవిత్ర సంగతేంటి?

గత నెల దర్శన్ తో పాటు పవిత్ర కూడా బెయిల్ కోసం కింది కోర్టులో అప్పీల్ చేసింది. అయితే ఇద్దరి బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. దీంతో వెంటనే హైకోర్టును ఆశ్రయించాడు దర్శన్. అత్యవసరంగా ఆపరేషన్ చేయించుకోవాలని కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరాడు. అతడి వాదనతో కోర్టు అంగీకరించింది.

మరి పవిత్ర గౌడ కు ఎందుకు బెయిల్ ఇవ్వాలి?

పవిత్ర కూడా తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. కేసు కొలిక్కి వచ్చింది కాబట్టి, సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం కూడా లేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరింది. ఆమె బెయిల్ పై విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు.

అయితే పవిత్రకు బెయిల్ రావడం కష్టం అంటున్నారు న్యాయ నిపుణులు. పవిత్ర చెప్పులు, దుస్తుల నుంచి మృతుడు రేణుకాస్వామి రక్తం మరకలు, డీఎన్ఏను గుర్తించారు. పైగా ఆమె మొబైల్ నుంచి కూడా బలమైన సాక్ష్యాల్ని సేకరించారు. ఈ కారణాల వల్ల ఆమెకు బెయిల్ రావడం కష్టం అంటున్నారు.

మరోవైపు ఏ-1గా ఉన్న పవిత్రకు బెయిల్ ఇస్తే, ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా వాళ్లకు కూడా ఆటోమేటిగ్గా బెయిల్ వచ్చేస్తుంది. ఇది కేసును మరింత నీరుగార్చే అవకాశం ఉంది. అందుకే పవిత్రకు బెయిల్ కష్టం అంటున్నారు.

హాస్పిటల్ లో చేరిన దర్శన్.. అటు 6 వారాల మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చిన దర్శన్.. ఈరోజు బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరాడు. వైద్యులు ఆయనకు మరోసారి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. జైలు అధికారులు ఇచ్చిన రిపోర్టను కూడా పరిశీలించిన డాక్టర్లు.. దర్శన్ కు సర్జరీ చేయాల్సిందేనని అంటున్నారు.

7 Replies to “హాస్పిటల్ లో దర్శన్.. ఇటు పవిత్ర?”

Comments are closed.