కుయ్యంగారి బిరియాని త‌యారీ

కుయ్యంగార్ అనే న‌టుడు బిరియాని హోట‌ల్‌కి వెళ్లాడు. సినిమాల్లో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. బ‌య‌టే క్యారెక్ట‌ర్ వుండ‌దు. బిరియాని వ‌చ్చింది. రుచి చూసాడు. తుపుక్కున ఊసాడు. మ‌ల‌బ‌ద్ధ‌కానికే విరోచ‌నాలు తెప్పించేలా వుంది. “ఇదేం బిరియాని…

కుయ్యంగార్ అనే న‌టుడు బిరియాని హోట‌ల్‌కి వెళ్లాడు.
సినిమాల్లో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. బ‌య‌టే క్యారెక్ట‌ర్ వుండ‌దు. బిరియాని వ‌చ్చింది. రుచి చూసాడు. తుపుక్కున ఊసాడు.
మ‌ల‌బ‌ద్ధ‌కానికే విరోచ‌నాలు తెప్పించేలా వుంది. “ఇదేం బిరియాని రా” అని అడిగాడు స‌ర్వ‌ర్‌ని. కుయ్యంగార్ భాష‌కి స‌ర్వ‌ర్ ఆశ్చర్య‌పోతూ “చికెన్ బిరియాని సార్” అని వినయంగా చెప్పాడు.

“పిలు మీ ఓన‌ర్‌ని” అని అరిచాడు. ఓన‌ర్ వ‌చ్చాడు.
“ఇది బిరియానినా, ఎండు గ‌డ్డా?”
“గ‌డ్డి అయితే ప‌శువుల‌కి పెడ‌తాం. బిరియాని కాబ‌ట్టే మీకు పెట్టాం” చెప్పాడు ఓన‌ర్‌.
“ఎవ‌డ్రా నువ్వు, అపాన వాయువుకి ఆత్మ బంధువులా ఉన్నావ్” తిట్టాడు కుయ్యంగార్‌.
ఓన‌ర్ ఆశ్చ‌ర్య‌పోకుండా స‌ర్వ‌ర్ల‌కి సైగ చేసాడు. కుయ్యంగార్‌ని కిచెన్‌లోకి లాక్కెళ్లారు.
“అరే, బొద్దింక‌ల‌కి పళ్లు తోమే స‌న్యాసుల్లారా ఏం చేస్తున్నారు?” అని అరిచాడు కుయ్య.
“తిట్ల‌కి భ‌య‌ప‌డ‌డానికి నేనేం సినిమా జ‌ర్న‌లిస్ట్‌ని కాను, బిరియానిస్ట్‌ని” అని ఓన‌ర్ స్టౌ అంటించి “చెయరా బిరియాని” అన్నాడు.
“నేనెందుకు చేస్తాన్రా. అది నీ ప‌ని”
“బిరియాని చేయ‌డం నీ ప‌ని కాన‌పుడు, బిరియాని బాలేద‌ని ఎందుకు అన్నావ్‌”
“డ‌బ్బులిస్తున్న‌ప్పుడు, బాగ‌లేక‌పోతే అడిగే హ‌క్కు లేదా?”
“ఈ హోట‌ల్ రెంట్ నెల‌కి రూ.10 ల‌క్ష‌లు. ఖ‌ర్చులు రూ.20 ల‌క్ష‌లు. నేను క‌ట్టే ట్యాక్స్ ఏడాదికి రూ.కోటి. ఇక్క‌డ వంద మంది ఉద్యోగులున్నారు” చెప్పాడు ఓన‌ర్‌.
“నీ పిండం పిల్లుల‌కి పెట్టా. అదంతా నాకెందుకు? రూ.500 తీసుకుని తొక్క‌లో బిరియాని పెట్టావు. నేను క‌స్ట‌మ‌ర్‌ని, అడిగే హక్కు నాకుంది?”
“ఆ హ‌క్కు ప్రేక్ష‌కుడికి కూడా వుంటుంది. స‌మీక్ష‌కుడు కూడా ప్రేక్ష‌కుడే క‌దా. నువ్వు రూ.100 కోట్ల‌తో తీస్తే వాడికేం? షార్ట్ ఫిల్మ్ తీయ‌డం చేత‌కాని వాడు కూడా సినిమాల గురించి మాట్లాడ్తాడు అన్నావా లేదా?”
“అన్నాను”
“మ‌రి బిరియాని కాదు క‌దా, నీ వ‌ల్లైతే గ్రేవీ, రైతా చెయ్ చాలు”
“నేను చేయ‌లేను బుద్ధొచ్చింది”
“బుద్ధి వ‌య‌సుతో పాటే రావాలి. మ‌ధ్య‌లో రాకూడ‌దు”
క‌ట్ చేస్తే కుయ్యంగార్ కారు స‌ర్వీస్ స్టేష‌న్‌కు వెళ్లి
“అరే , క్రిముల‌కి కోల్డ్ క్రీమ్ అమ్మే ముఖంవాడా నిన్న రూ.20 వేలు బిల్లు చేశావ్‌. ఈ రోజు కారు స్టార్ట్ కావ‌డం లేదు”
మెకానిక్ కూల్‌గా “కుయ్యంగార్ గారు , కారుకి ఎన్ని స్పేర్‌పార్ట్స్ వుంటాయో తెలుసా?”
“నాకెందుకు తెలియాలి. నేనేమ‌న్నా మెకానిక్‌నా?”
“కారు ఫ్యాక్ట‌రీ విలువ ఎంతో తెలుసా? ఎంత మంది ప‌ని చేస్తే ఒక కారు త‌యార‌వుతుందో తెలుసా?”
“అవ‌న్నీ నాకెందుకురా దోమ‌ల‌కి బంతి భోజ‌నం పెట్టేవాడా?”
“ఒక కారు ఎలా త‌యార‌వుతుందో తెలియ‌న‌ప్పుడు , మెకానిక్‌ని ప్ర‌శ్నించొచ్చా?”
“అర్థ‌మైంది. ఇదంతా నా పొట్టేలు వాగుడు ఫ‌లితం క‌దా?”
“ఈ లోకంలో కుక్క చేసే ప‌ని కుక్క‌, గాడిద చేసే ప‌ని గాడిద చేయాలి. టికెట్ ఇచ్చే కొనేవాడు …సుత్తి సినిమాల్ని ఎగిచ్చి తంతాడు. రివ్యూ రాసేవాడు న‌చ్చ‌క‌పోతే చెత్త అని రాస్తాడు. అది అత‌ని డ్యూటీ. త‌ప్పుడు రాత‌లు రాసేవాన్ని కొంత కాలానికి జ‌న‌మే న‌మ్మ‌రు. త‌ప్పుడు కూత‌లు కూసేవాన్ని ఏం చేయాలో కూడా ప్రేక్ష‌కుల‌కి తెలుసు. అందుక‌ని కుయ్యంగార్ గారు నాలుక అదుపులో పెట్టుకోండి. సినిమా జ‌ర్న‌లిస్టుల‌కి స‌హ‌నం ఎక్కువ‌. అందుక‌ని నువ్వు వ‌దిలిన వాయువుని భ‌రించారు” అని మెకానిక్ న‌ట్లు బిగించాడు.
కుయ్యంగార్ సోడా కొట్టిన‌ట్టు కుయ్య్‌మ‌ని సౌండ్ ఇచ్చాడు.

జీఆర్ మ‌హ‌ర్షి

13 Replies to “కుయ్యంగారి బిరియాని త‌యారీ”

  1. Boodida gummadikayala donga…??? Dorikipoyaaavoch.. inka bujalu tadumukunna laabham ledu….

    Aina vajrallanti matalu raase meeru ilantivi raasi mee website name tagginchukuntunnaru. ..

  2. రెస్టారెంట్ లో వంటచేసేవాడిని ఏ ప్రతిభ లేకుండా పెట్టుకోరు.

    కారు మెకానిక్ కు కూడా ఆ రంగంలో ప్రతిభ ఉండి తీరాలి.

    కానీ ఈ ఫిల్మ్ క్రిటిక్స్ లో ఎంత మందికి ఆ రంగంలో ప్రతిభ ఉంది????

    కేవలం ఓ నాలుగు హాలీవుడ్, రెండు కొరియన్ సినిమాలు చూసేసిన ప్రతివాడు హీరో అయితే ఎలా???

    1. Ante movie industry lo vallanta talent tho nidina valla. There are bad and good mechanics and same for cooks some will learn their weaknesses or mistakes and they will try to improve. same applies to reviewers.

  3. అతి తెలివి GA…. వంట రాని వాడ్ని ఒక్క రోజు కూడా ఎవ్వరూ భరించరు….అలాగే మీలా కనీస అవగాహన లేకుండా పెంట రాతలు రాసేవాళ్ళని ఎందుకు భరించాలి అని అయ్యంగార్ అడుగుతున్నారు….అంతే….

  4. తాత …ఎందుకొచ్చింది చెప్పు నువ్వు చెప్పిన పనుల్లో సామర్థ్యం ఉంటేనే నెగ్గుకురాగలరు …పెన్ను ఉంటె చాలు సమీక్ష రాసే మీ లాంటి మేధావులు ఉన్నతవరకు kuyyangar లాంటోళ్ళ కూతలు తప్పవు … మీలాంటోళ్ళ కి భుజాలు తడుముకోవడాలు తప్పవు….

  5. ఈ కాలం ప్రతి చిన్నా చితకా పనీ వస్తువు సేవా.. అన్నిటికీ ఫీడ్బ్యాక్ రివ్యూ రేటింగ్.. ఇచ్చే సౌకర్యం ఉంది.. ఈ బోడిముండా సినిమాల గురించి అంత గించుకోవలసిన అవసరం లేదు.. ఈ పనికిమాలిన సినిమాల వల్ల సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు…

Comments are closed.