Advertisement

Advertisement


Home > Movies - Movie News

దసరా క్లయిమాక్స్ కు అయిదు కోట్లు

దసరా క్లయిమాక్స్ కు అయిదు కోట్లు

నాని హీరోగా నిర్మిస్తున్న దసరా సినిమా కోసం దాదాపు 70 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిన సంగతి ఇప్పటికే వార్తల్లో వుంది. నాని కెరీర్ లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే. ఈ సినిమా క్లయిమాక్స్ కే అయిదు కోట్ల ఖర్చు చేసారట. 

సినిమాలో క్లైమాక్స్ 15 నిమిషాలు వుంటుందని తెలుస్తోంది. క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్లు, ఫైట్స్ ఇలా అన్నీ కలబోతగా ఏకబిగిన 15 నిమిషాలు కొనసాగుతుందన్నమాట. ఈ టోటల్ ఎపిసోడ్ కు అయిదు కోట్లు ఖర్చు చేసారట. 

సెట్, జూనియర్ ఆర్టిస్ట్ లు, వర్కింగ్ డేస్, ఇలా అన్నీ కలిపి అయిదు కోట్లు ఖర్చు చేసారు. దసరా సినిమా కు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పని చేసారు. కానీ అతగాడికి డిటైలింగ్ మీద విపరీతమైన ఇంట్రస్ట్ వున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఖర్చు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఇంకా నిన్న కూడా నాని మరోసారి డబ్బింగ్ చెప్పారు. రెండు మూడు రోజుల ముందు కరెక్షన్స్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ నిన్నటికి నిన్న డబ్బింగ్ కరెక్షన్స్ చేసారు.

సెన్సారు అయిపోయింది. విడుదలకు ఇంకొ పది రోజులు మాత్రమే వుంది సమయం. చెన్నయ్ లో మిక్సింగ్ వర్క్ జ‌రుగుతోంది. నాలుగైదు భాషల్లో విడుదలకు కాపీని రెడీ చేయాల్సి వుంది. మరోపక్క రాత్రి వేళల్లోనే టైమ్ చూసి, ప్రీ రికార్డెడ్ ఇంటర్వూలు కూడా చేస్తున్నారు. ఇవి కాక ఇంకా అహ్మదాబాద్, నాగపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్ చేయాల్సి వుంది. ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ చెరుకూరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?