ఓ ఇంటివాడైన దసరా దర్శకుడు

దసరా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఓ ఇంటివాడయ్యాడు. రీసెంట్ గా అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని దసరా హీరో నాని స్వయంగా బయటపెట్టాడు. “మన శ్రీకాంత్ ఓదెల…

దసరా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఓ ఇంటివాడయ్యాడు. రీసెంట్ గా అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని దసరా హీరో నాని స్వయంగా బయటపెట్టాడు. “మన శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్నాడు. అందరూ అతడికి శుభాకాంక్షలు తెలపండి” అంటూ శ్రీకాంత్ ఓదెల పెళ్లి ఫొటోను కూడా షేర్ చేశాడు.

ఓవైపు దసరా ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న వేళ.. తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశాడు శ్రీకాంత్ ఓదెల. తన చిన్ననాటి స్నేహితురాలు సౌమ్య కృష్ణను పెళ్లాడాడు. దసరా సినిమాను ఎక్కువగా షూట్ చేసిన గోదావరి ఖని ప్రాంతంలోనే శ్రీకాంత్ పెళ్లి జరిగింది.

ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ కోసం ముంబయిలో ఉన్న నాని, ఈ పెళ్లికి వెళ్లాడా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఈ హీరో తన దర్శకుడి పెళ్లి ఫొటోను మాత్రం షేర్ చేశాడు.

దసరా అనే ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. తెలంగాణలోని సింగరేణి సమీపంలో ఉన్న వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే ఈ కథలో నాని-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు. మార్చి 30న రిలీజైన ఈ సినిమా నైజాంలో పెద్ద హిట్టయింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా సూపర్ సక్సెస్ అయింది.

దసరా సక్సెస్ తో శ్రీకాంత్ ఓదెలకు వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి. అయితే అతడు తన నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ ను ఇంకా బయటపెట్టలేదు.