దసరా కు ఎన్ని సినిమాలు?

కరొనా వచ్చి టాలీవుడ్ పెద్ద సినిమాల ఆశల మీద నీళ్లు చల్లేసింది. సమ్మర్ ను చటుక్కున మాయం చేసింది. సమ్మర్ కు రెడీ అయ్యే సినిమాలను పక్కన పడేలా చేసింది. రెండేళ్లుగా నలుగుతున్న మెగాస్టార్-కొరటాల…

కరొనా వచ్చి టాలీవుడ్ పెద్ద సినిమాల ఆశల మీద నీళ్లు చల్లేసింది. సమ్మర్ ను చటుక్కున మాయం చేసింది. సమ్మర్ కు రెడీ అయ్యే సినిమాలను పక్కన పడేలా చేసింది. రెండేళ్లుగా నలుగుతున్న మెగాస్టార్-కొరటాల శివ ఆచార్య సినిమా ఎప్పుడు రెడీ కావాలి. ఇంకా నలభై రోజుల వరకు వర్క్ వుందని టాక్.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు ఇరవై ప్లస్ ఇరవై టోటల్ గా నలభై రోజుల వర్క్ వుంది. బోయపాటి-బాలయ్య ల సినిమా ఇంకా జస్ట్ ఒక్క షెడ్యూలు మాత్రమే పూర్తి చేసుకుంది. వెంకీ చేసే రీమేక్ నారప్ప సగం మాత్రమే పూర్తయింది. 

మీడియం హీరోల పరిస్థితి కొంచెం బెటర్. నాని వి సినిమా విడుదలకు రెడీగా వుంది. రామ్ రెడ్ దాదాపు పూర్తయింది. రవితేజ -క్రాక్ దాదాపు పూర్తయిపోయింది. శర్వానంద్ శ్రీకారం పని కొంచెం వుంది.  అక్కినేని బ్రదర్స్ సినిమాలు లవ్ స్టోరీ,  రెండూ ఇంకా పెండింగ్ వర్క్ తో వున్నాయి. 

సమ్మర్ ఎలాగూ మిస్ అయిపోయింది. థియేటర్లు మే 1 కన్నా తీస్తారో లేదో తెలియదు. థియేటర్లు మే 1 కి ఓపెన్ అయినా, ఇప్పటికి రెడీ అయిపోయిన ఉప్పెన, వి లాంటి సినిమాలకు అవకాశం వుంటుంది తప్ప, రెడీ కావాల్సిన వాటికి కాదు.   కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి దసరా మీదే. ఎందుకంటే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వుండనే వుంది. 

అందువల్ల పెద్ద, మీడియం  సినిమాలు అన్నీ వినాయక చవితి నుంచి దీపావళి వరకు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు గిల్డ్ రంగంలోకి దిగాల్సిందే. పలుకుబడి, గిల్డ్ మీద పట్టు వున్నవాళ్ల సినిమాలకు మంచి డేట్ లు దొరకుతాయి. మిగిలిన వారు దొరికిన డేట్ తో సర్దుకోవాల్సిందే.

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?