కొనసాగుతున్న కరోనా మరణమృదంగం

ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 204 దేశాల్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తోంది. అమెరికాలోనైతే కరోనా భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే అగ్రరాజ్యంలో 968 మంది మరణించారు. దీంతో యూఎస్ లో…

ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 204 దేశాల్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తోంది. అమెరికాలోనైతే కరోనా భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే అగ్రరాజ్యంలో 968 మంది మరణించారు. దీంతో యూఎస్ లో కరోనా మృతుల సంఖ్య 6075కు చేరింది. అటు కొత్తగా 29874 కేసులు నమోదవ్వడం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో 2,44,877 మంది కరోనా బాధితులున్నారు.

ఇటలీలో కూడా కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ సంఖ్య 13,915కు చేరింది. నిన్న ఒక్క రోజే ఇటలీలో 760 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో కంపెనీలన్నీ యాంటీబయోటిక్స్ తో పాటు వెంటిలేటర్లు తయారుచేసే పనిలో పడ్డాయి. ఇటలీకి కాస్త ఊరటనిచ్చే అంశం ఒకే ఒక్కటి. రోజుకు కనీసం 9వేల మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే ఆ దేశంలో, నిన్న కేవలం 4668 మంది మాత్రమే పాజిటివ్ గా తేలారు.

అమెరికా, ఇటీల తర్వాత స్పెయిన్, జర్మనీలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. స్పెయిన్ లో మృతుల సంఖ్య 10వేలు దాటగా.. జర్మనీలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. అటు చైనాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తోంది. నిన్న కొత్తగా కేవలం 35 కేసులు మాత్రమే నమోదుకాగా.. మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. మరో 2 వారాల్లో తమ దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని చెబుతోంది చైనా.

ప్రస్తుతం ఫ్రాన్స్, ఇరాన్, యూకే, స్విట్జర్లాండ్ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూకేలో నిన్న ఒక్కరోజే 4244 మంది కరోనా పాజిటివ్ కేసులు లెక్కతేలారు. ఇక ఇండియాలో కూడా కేసుల సంఖ్య 2500 దాటింది. మృతుల సంఖ్య 72కు చేరింది. ఇప్పటివరకు 55వేలకు పైగా టెస్టులు నిర్వహించిన భారత్, ప్రస్తుతం రోజుకు 8వేల టెస్టుల్ని నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మిలియన్ మార్క దాటింది. మృతులు 53వేలుకు చేరారు. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ 2 లక్షల 13వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.

తమన్నా చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి