‘దసరా’ కు పోటీ సమస్యలు

పాన్ ఇండియా ప్రయోగం చేస్తున్నాడు దసరా తో హీరో నాని. తెలుగు కన్నా ముందుగా తమిళనాట, హిందీ బెల్డ్ లో భారీ ప్రచారాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో తను పాన్ ఇండియా హీరో కావాలనుకుంటున్నాడు.…

పాన్ ఇండియా ప్రయోగం చేస్తున్నాడు దసరా తో హీరో నాని. తెలుగు కన్నా ముందుగా తమిళనాట, హిందీ బెల్డ్ లో భారీ ప్రచారాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో తను పాన్ ఇండియా హీరో కావాలనుకుంటున్నాడు. అందుకే అన్ని భాషల్లో చాలా క్వాలిటీ డబ్బింగ్ చేయించి మరీ విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు పని చేసిన టీమ్ లతో డబ్బింగ్ వర్క్ చేయించారు. లిరిక్స్ రాయించారు. వాయిస్ ల ఎంపిక చేసారు. దీని వల్ల డబ్బింగ్ ఖర్చు అయిదుకు బదులు పదిహేను అయింది. సరే క్వాలిటీ కోసం ఇదంతా చేసారు. మంచిదే.

కానీ విడుదల డేట్ అన్నది సమస్య. అదే రోజు హీందీలో అజయ్ దేవగన్ ‘భోళా’ విడుదల వుంది. తెలుగు, తమిళంలో మంచి అప్లాజ్ వచ్చిన ఖైదీ సినిమా రీమేక్. అజయ్ దేవగన్, టబు, అమలపాల్ నటించారు. రాయ్ లక్ష్మి ఐటమ్ సాంగ్. అమితాబ్ కామియో రోల్. చాలా భారీ సినిమా ఇది. ఈ లోకల్ పోటీని నాన్ లోకల్ దసరా ఎదుర్కోవాల్సి వుంటుంది. అది కూడా పక్కా రూరల్ స్టోరీతో.

హిందీ వెర్షన్ నుంచి నిర్మాతకు కనీసం 15 కోట్లు రావాలి. అంటే ముఫై కోట్లకు పైగా గ్రాస్ చేయాలి. ఇది చాలా పెద్ద ఫీట్. దాన్ని అచ్యూవ్ చేయగలిగితే ఇకపై నాని సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మారిపోతాయి. ఎందుకంటే నాని అంతలా పరిచయం అయిపోతాడు బాలీవుడ్ కు..నార్త్ బెల్ట్ కు.

హిందీలో పరిస్థితి ఇలా వుంటే తమిళంలో కూడా కాస్త పోటీనే వుంది. శింబు పట్టుదల సినిమా అదే రోజు విడుదలవుతోంది. విజయ్ సేతుపతి-వెట్రీమారన్ కాంబినేషన్ సినిమా విడుదలై కూడా అదే రోజు వస్తుందంటున్నారు. సో ఇక్కడ కూడా పోటీని తట్టుకుని దసరా ముందుకు వెళ్లాలి. మలయాళం, కన్నడ మార్కెట్ లు పెద్ద లెక్కలోకి తీసుకునేవి కాదు.