‘దసరా’ లో కులాల సమరం?

రంగస్థలం తరువాత అలాంటి నేటివిటీ కథలకు డిమాండ్ కనిపిస్తోంది. నాని చేస్తున్న దసరా సినిమా కూడా ఇలాంటిదే అన్న టాక్ వినిపిస్తోంది. సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఈ సినిమాలో కథ…

రంగస్థలం తరువాత అలాంటి నేటివిటీ కథలకు డిమాండ్ కనిపిస్తోంది. నాని చేస్తున్న దసరా సినిమా కూడా ఇలాంటిదే అన్న టాక్ వినిపిస్తోంది. సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఈ సినిమాలో కథ కులాల చుట్టూ తిరుగుతుందట. 

ఓ అగ్రకులం, ఓ బడుగు కులం మధ్య ఘర్షణల నేపథ్యంలో కథ వుంటుందని, హీరో బడుగు కులం ప్రతినిధిగా కనిపిస్తాడని, హీరో పాత్ర, సినిమా మొత్తం బాగా రఫ్ గా నడుస్తుందని వినిపిస్తోంది.

శ్యామ్ సింగ రాయ్ లో కూడా హీరో బడుగు వర్గాల పక్షపాతిగా నటించారు. అయితే అందులో హీరో పాత్ర, టేకింగ్ రఫ్ గా, నేటివ్ టచ్ తో వుండవు కానీ దసరాలో మొత్తం సినిమా రంగస్థలం మాదిరిగా ఫుల్ నేటివిటీ టచ్ తో వుంటుందని తెలుస్తోంది. 

గతంలో జెండాపై కపిరాజు, పైసా ఇలా కొన్ని పక్కా మాస్ పాత్రలు ట్రయ్ చేసిన నాని మరోసారి అలాంటి పక్కా మాస్ క్యారెక్టర్ ట్రయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వదిలిన స్టిల్ కూడా ఇదే కన్ ఫర్మ్ చేస్తోంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు పనిచేస్తున్నాడు. 

ముందుగా జూనియర్ ఆర్టిస్ట్ లతో కొంత ఫుటేజ్ తీయించిన తరువాత నాని ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చారు. విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలను విడుదల చేయడానికి రెడీ చేస్తున్న నిర్మాత సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.