అసలే పెద్ద సినిమాల్లేవ్. ఉన్న సినిమాల్ని కూడా ప్రాపర్ ప్లానింగ్ తో విడుదల చేయకపోతే ఎలా? దసరా సినిమాలు రిలీజ్ కష్టాలు పడుతున్నాయి.
గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఆలస్యంగా మొదలైంది. ఇంకా చెప్పాలంటే, మార్నింగ్ షోలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఈ ప్రభావం మ్యాట్నీ షోలపై పడుతుంది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో సినిమా చెప్పిన టైమ్ కు విడుదల కాకపోవడానికి ఎప్పట్లానే ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. అయితే గంటల్లోనే సమస్యను సర్దుబాటు చేసి సినిమాను రిలీజ్ చేసినప్పటికీ, జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ కంటే, కౌంటర్ సేల్స్ ఎక్కువ కాబట్టి.. ఈ ఆలస్యం మొదటి రోజు వసూళ్లపై ప్రభావం చూపించబోతోంది.
ఇటు దసరా బరిలో నిలిచిన మరో సినిమా మార్టిన్. కన్నడ హీరో ధృవ సర్జా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ఇది. కన్నడతో పాటు.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకు ప్లాన్ చేశారు.
కానీ ఆఖరి నిమిషంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ తో పాటు.. చెన్నై, కోల్ కతా, ఆగ్రా, ఢిల్లీ లాంటి కీలకమైన ప్రాంతాల్లో కొన్ని చోట్ల షోలు పడలేదు. దీనికితోడు సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో, మ్యాట్నీ ఆటలు కూడా రద్దవుతున్నాయి.
ఇక అలియా భట్ నటించిన జిగ్రా సినిమా షోలు కూడా రద్దవుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఎటొచ్చి సినిమాపై తెలుగు ఆడియన్స్ లో పెద్దగా ఆసక్తి లేదు. దీంతో మినిమం బుకింగ్స్ లేక మార్నింగ్ షోలు రద్దయ్యాయి.
vc available 9380537747
Call boy jobs available 9989793850
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేస్తే ఈ కష్టాలు ఉండవు