నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన సినిమా దసరా. ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ వచ్చింది, ఓవర్ సీస్ లో కలెక్షన్లు అదిరాయి. నైజాంలో లాభాల పంట పండించింది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో కలెక్షన్లు దుమ్ము దులిపాయి. కానీ ఆంధ్రకు వచ్చేసరికి మంచి ఓపెనింగ్ వచ్చి జారిపోయింది.
ఆంధ్ర అంటే అటు సీడెడ్..ఇటు ఆంధ్ర రెండు చోట్లా. ఎందుకిలా? అన్నది ప్రశ్న. నైజాం, ఓవర్ సీస్ జనాలు అందరికీ నచ్చిన సినిమా ఆంధ్ర, సీడెడ్ జనాలకు ఎందుకు నచ్చలేదు.
సబ్జెక్ట్ ప్రోబ్లెమ్ కాదనే అనుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రొబ్లెమ్ అయితే అన్ని చోట్లా ఒకటే ఫలితం వుంటుంది. మాండలీకమే సమస్య అనుకోవాలి. ఎందుకంటే దసరా సినిమా మొత్తం అథెంటిక్ తెలంగాణ మాండలీకం వాడారు.
తెలంగాణ జనాలు కూడా కొన్ని చోట్ల అర్థం చేసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా నాని నేరుగా పూర్ణ ఇంటికి వచ్చి మాట్లాడిన మాటల విషయంలో. ఆంధ్రలో జనాలు కొంత వరకు బెటర్ అర్థం చేసుకోవడంలో. అందుకే అక్కడ కలెక్షన్లు ఓ మాదిరిగా వున్నాయి. కానీ సీడెడ్ లో ఎక్కువ సమస్య అయిందనుకోవాల్సిందే.
గతంలో కోటా లాంటి నటులు తెలంగాణ మాండలీకంలో డైలాగులు చెప్పినా నెమ్మదిగా చెప్పేవారు. అవి జనాలకు పట్టేవి. కానీ నాని అలాకాదు. చాలా వేగంగా చెప్పుకుంటూ వెళ్లారు. అది అందరూ క్యాచ్ చేయలేకపోయారన్నది ఓ ఫీడ్ బ్యాక్. తెరమీద తెలుగులో కిందన సబ్ టైటిల్స్ వేసి వుంటే ఎలా వుండేదో కూడా.
అదృష్టం ఏమిటంటే మంచి ఓపెనింగ్ రావడం. ఈవారం కూడా వరుస సెలవుల వీకెండ్ రావడం. అందువల్ల ఆంధ్ర బయ్యర్లు మెల్లగా బ్రేక్ ఈవెన్ అవుతారని ట్రేడ్ వర్గాల బోగట్టా. చూడాలి మరి.