దసరా టైమ్ లో దంచవే మేనత్త

బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మించిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ విషయం వుందని టాక్ వుంది. అదేమిటంటే, బాలయ్య ఎవర్ గ్రీన్ హిట్.. దంచవే మేనత్త…

బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మించిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ విషయం వుందని టాక్ వుంది. అదేమిటంటే, బాలయ్య ఎవర్ గ్రీన్ హిట్.. దంచవే మేనత్త కూతురా’ పాటను రిమిక్స్ చేసారు అన్నది. 

అయితే మేకర్స్ ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా రివీల్ చేయలేదు. ఆ పాట రీమిక్స్ చేసారా లేదా అన్న సంగతి పక్కన పెడితే సినిమాలో ఒక ఇంట్రస్టింగ్ సాంగ్ అయితే వుందట. కానీ అది 19న విడుదలయ్యే కాపీలో వుండదట.

దసరా పండగ రోజున సినిమాకు యాడ్ చేస్తారట. ఇదో కొత్త ప్రయోగం. సాధారణంగా ఇలా పక్కన పెట్టిన సాంగ్ ను, మూడు నాలుగు వారాల తరువాత యాడ్ చేస్తారు. కానీ జస్ట్ కొన్ని రోజుల తరువాత యాడ్ చేయడం అంటే కొత్త ప్రయోగమే. ఇంతకీ ఇలా చేయడం ఎందుకు అంటే, ఆ పాట సినిమాలో ఎక్కడ పెడదామన్నా సెట్ కావడం లేదంట. క్లయిమాక్స్ ముందు ప్రీ క్లయిమాక్స్ లో మాత్రమే సెట్ అవుతోందట. 

కానీ సీరియస్ టోన్ లో నడిచే టైమ్ లో ఈ పాట పెట్టి ఆడియన్స్ మూడ్ ను ఎందుకు సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్లాలి అనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ముందు సినిమాను తాము అనుకున్నట్లు ఇంటెన్సివ్, సీరియస్ టోన్ లో విడుదల చేసి, దసరా కానుక గా అభిమానులకు పాటను యాడ్ చేసి అందించాలని డిసైడ్ చేసారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇంతకీ పాట ఈ దంచవే మేనత్త కూతురా సాంగ్ నా కాదా అన్నది తెలియాల్సి వుంది.