Advertisement

Advertisement


Home > Movies - Movie News

మంచి టైమ్ లో వస్తున్న దాస్ ధమ్కీ

మంచి టైమ్ లో వస్తున్న దాస్ ధమ్కీ

జ‌నం సరైన సరదా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం. ధమాకా తరువాత సరైన సినిమా పడలేదు. చాలా వరకు పరీక్షలు ముగిసాయి. పెద్ద తరగతులకు మాత్రం బకాయి వున్నాయి. ఉగాది టైమ్. ఇలాంటి టైమ్ లో వస్తోంది విష్వక్ సేన్ ధమ్కీ. పూర్తి టైటిల్ దాస్ కా ధమ్కీ.  

బహుశా ఫలక్ నుమా దాస్ సెంటిమెంట్ యేమో? టైటిల్ లో దాస్ వుండడం. మొత్తానికి సినిమాకు ఓ లెవెల్ బజ్ అయితే తీసుకువచ్చాడు హీరో విష్వక్ సేన్. విపరీతంగా పబ్లిసిటీ చేసాడు. ప్రతి దాంట్లో తాను ఇన్ వాల్వ్ అయ్యాడు. మొత్తానికి ఓపెనింగ్ ఓ మాదిరిగానే అయినా వచ్చేలా కనిపిస్తోంది.

ధమ్కీకి వున్న అడ్వాంటేజ్ లు ఏమిటంటే ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్ వచ్చి దాదాపు నాలుగు వారాలు కావడం. మధ్యలో సార్ లాంటి హిట్ ఒకటి పడింది కానీ అది మాస్ ఎంటర్ టైనర్ కాదు. ధమాకా ఒక ఊపు ఊపిన తరువాత జ‌నం కాస్త డబ్బులు పెట్టింది సార్ కే. అది కూడా కొంత వరకే. ఇప్పుడు చిన్న తరగతుల స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఫ్యామిలీలకు కాస్త వెసులు బాటు దొరికింది. ఉగాది టైమ్ కూడా. సరైన కాంపిటీషన్ లేదు.

ఇవన్నీ కలిసి ధమ్కీ కి మంచి కలెక్షన్లు ఇచ్చే అవకాశం వుంది. ఓపెనింగ్ ఓ మాదిరిగా వున్నా, సినిమా ఎంటర్ టైన్ మెంట్ బాగుంది అనిపించుకుంటే చాలు నిలబడే అవకాశం వుంది. ఈ సినిమా కోసం హీరో విష్వక్ తన సమస్తం పెట్టేసారు. నైజాంలో ఓన్ రిలీజ్ కు వెళ్తున్నారు. తను చేయబోయే సినిమాల అడ్వాన్స్ లు కూడా ఈ సినిమా కోసం వాడేసారు. ఈ సినిమాను విపరీతంగా నమ్మి ఖర్చు చేసారు. తనే డైరక్షన్ చేసారు. అందువల్ల ఈ సినిమా సక్సెస్ విష్వక్ కు నూటికి రెండింతలు అవసరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?