Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

డిసెంబర్ లో శాకుంతలం?

డిసెంబర్ లో శాకుంతలం?

దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంత దే కీలకపాత్ర. ఇతర భాషల నటులు కూడా వున్నారు. ఈ సినిమా ఏనాడో పూర్తయిపోయింది. సిజి వర్క్ లు అవీ జరుగుతున్నాయి. 

సినిమాకు నిర్మాత దిల్ రాజు కావడంతో ఎప్పుడ విడుదల అన్నది ఆయనే డిసైడ్ చేస్తారు కనుక గుణశేఖర్ సైలంట్ గా వున్నారు. సంక్రాంతికి విడుదల చేస్తారు అని కొన్నాళ్ల క్రితం వినిపించింది. కానీ లేటెస్ట్ గా డిసెంబర్ తొలివారం లేదా నవంబర్ ఆఖరి వారం లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

సంక్రాంతికి దిల్ రాజు - విజయ్- వంశీ పైడిపల్లి సినిమా వుంది. అందువల్ల అప్పుడు సాధ్యం కాదు. అదే డిసెంబర్ తొలివారం అయితే బెటర్ అని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ తొలివారంలో ఇప్పటికే ధనుష్ సర్, నాని నిర్మిస్తున్న హిట్ 2 సినిమాలు ప్లాన్ చేసి వున్నాయి. మరి ఈ సినిమాలకు ముందుగానో, వెనుకగానో శాకుంతలం డేట్ వుంటుందేమో? ఈ వారంలో సమంత విదేశాల నుంచి తిరిగి వస్తున్నారని బోగట్టా. ఆమె రాగానే ఓ మాట చెప్పి డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?