Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఏ జాతి..ఎవరికి పిత..బాలయ్యా?

ఏ జాతి..ఎవరికి పిత..బాలయ్యా?

హెల్త్ యూనిర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీయడం..తప్పా? ఒప్పా? సబబా? కాదా? అన్నది అలా పక్కన పెడదాం. అందులో ఎవరి వాదనలు వారికి వున్నాయి. ఉన్న పేర్లు తీసి వేరే పేర్లు పెట్టడం అన్నది అన్ని రాజకీయ పక్షాలు చేసే పనే. విజయవాడ బస్టాండ్ కో, తిరుపతి స్పోర్ట్స్ గ్రవుండ్ కో చంద్రబాబు పేర్లు మార్చితే మార్చి వుండొచ్చు. అప్పుడు లొల్లి జరగలేదు. ఇప్పుడు జగన్ మారిస్తే జరుగుతోంది. అది వేరే సంగతి. దాన్ని తప్పు, సరికాదు అని ఖండించే వాళ్లు ఖండిస్తూనే వున్నారు. కానీ ఎన్టీఆర్ తనయుడు బాలయ్య ఖండనే చిత్రంగా వుంది. తెలుగుజాతికే ఇది అవమానం అన్నది ఆయన మాట.

మాటకు వస్తే తెలుగుజాతి..దానికి నాయకుడు ఎన్టీఆర్ అన్నట్లు రుద్ది రుద్ది అలవాటు చేసారు. ఎవరికి పిత? ఎవరికి నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో సమానంగా గౌరవం తెచ్చుకున్నారు ఎఎన్నార్..ఎటొచ్చీ ఆయన రాజకీయాల్లోకి రాలేదంతే. రాముడంటే, కృష్ణుడంటే ఎన్టీఆర్ నే…తెలుగు జాతి ఐకాన్ అంటే ఎన్టీఆర్ నే అంటూ రుద్ది రుద్ది వదిలారు. అప్పట్లో మరో మీడియా లేదు. అన్ని మీడియాలు ఒకే పని మీద వుండేవి. కాంగ్రెస్ ను, కాంగ్రెస్ నాయకులను బదనామ్ చేయడం. మెల మెల్లగా ఓ సామాజిక పార్టీని నెలకొల్పడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం.

నాదెండ్ల, ఇంకా పలువురు రాసిన రాజకీయ పుస్తకాలు చదివితే అర్థం అవుతుంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక వున్న ఎజెండా అంతా. స్థాపించి ఏం చేసారు. తన సామాజిక వర్గం ఒక్కరంటే ఒక్కరు వున్నా చాలు,,ఆ నియోజకవర్గంలో వారికి సీటు ఇచ్చి గెలిపించుకున్నారు. ఎన్టీఆర్ తొలిసారి పార్టీ పెట్టినపుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానాల్లో అక్కడకు వలస వెళ్లిన తన సామాజిక వర్గ నాయకులకు ఎలా టికెట్ లు ఇచ్చారు. అప్పటికి చంద్రబాబు పార్టీలో లేరు కదా? ఎన్టీఆర్ ది, ఆయనకు సలహా ఇచ్చిన ఓ మీడియా అధినేతదే కదా ఆ నిర్ణయం.

ఆ విధంగా ఎక్కడో కృష్ణ జిల్లా నుంచి వలస వచ్చిన వారికి పెద్ద పీట వేసారు. స్థానికులను పక్కన పడేసారు. ఎంచి ఎంచి నార్ల తాతారావు, కోనేరు రామకృష్ణారావు, కాకర్ల సుబ్బారావు ఇలా తీసుకువచ్చి కీలక సంస్థలు అప్పగించారు. కానీ ఆ పత్రికల్లో మాత్రం వాళ్లు మాత్రమే సమర్థులు, వాళ్లు మాత్రమే మేధావులు. ఎన్టీఆర్ జాతి నాయకుడు.

మరి అంత గొప్ప జాతి నాయకుడిని కిందకు లాగేసి, రోడ్ల పాలు చేస్తే ఏ జాతికి అన్యాయం జరిగింది అన అనలేదే? ఆయన స్వంత ప్రాపర్టీ అయిన పార్టీని లాగేసుకుంటే ఎవ్వరూ కిమ్మనలేదేం? జాతికి అన్యాయం జరిగింది అని బాలయ్య బాధపడలేదేం. పైగా అలా లాగేయడానికి, కిందకు తోసేయడానికి తాను కూడా ఓ చేయి వేసారా? లేదా?

మరి అలా తండ్రికే వెన్నుపోటు పొడిచిన తనయుడి ఇప్పుడు ఆక్రోశించే హక్కు వుంటుందా? ఎన్టీఆర్ మంచి పనులు చేసారా? లేదా? అన్నది డిస్కస్ చేసినపుడు, తన సామాజిక వర్గ శ్రేయస్సు కోసం పని చేసారా? లేదా? అన్నది కూడా డిస్కస్ చేయాల్సి వుంటుంది. అలా ఓ సామాజిక వర్గం కోసం పని చేసిన నాయకుడు తెలుగుజాతి మొత్తానికి నాయకుడు ఎలా అవుతాడు?

మా నాన్న కు అన్యాయం జరిగింది అని చెప్పండి బాలయ్యా. అంతే కానీ తెలుగు జాతి..జాతి నాయకుడు అనకండి..జాతి అనగానే ఎన్టీఆర్ ఉద్దరించిన జాతి గుర్తుకు వస్తుంది. 

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను