డిసెంబర్ బాక్సాఫీస్.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు?

గతేడాది టాలీవుడ్ కు మంచి ఫినిషింగ్ దక్కింది. డిసెంబర్ నెలలో అఖండ, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలా 2021 బాక్సాఫీస్ కు మంచి ముగింపు దక్కింది. మరి ఈ ఏడాది…

గతేడాది టాలీవుడ్ కు మంచి ఫినిషింగ్ దక్కింది. డిసెంబర్ నెలలో అఖండ, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలా 2021 బాక్సాఫీస్ కు మంచి ముగింపు దక్కింది. మరి ఈ ఏడాది ఆ ఘనత అందుకునే సినిమాలేంటి? 2022 టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి ముగింపునిచ్చే సినిమాలేంటి?

గతేడాది టైపులో ఈ నెలలో పెద్ద సినిమాల సందడి లేనప్పటికీ, కొన్ని ప్రామిసింగ్ మూవీస్ మాత్రం క్యూ కట్టాయి. వీటిలో ముందుగా థియేటర్లలోకి వస్తున్న సినిమా హిట్-2. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా, హిట్ అనే సినిమాకు ఫ్రాంచైజీ. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

డిసెంబర్ లో థియేటర్లలోకి వస్తున్న మరో మూవీ 18-పేజెస్. నిఖిల్ హీరోగా నటించిన మూవీ ఇది. ఇంతకుముందు కార్తికేయ-2తో పెద్ద హిట్ అందుకున్నాడు నిఖిల్. దీంతో 18-పేజెస్ పై అంచనాలు పెరిగాయి. పైగా గీతాఆర్ట్స్ 2 నుంచి వస్తున్న సినిమా కావడం, సుకుమార్ రైటింగ్స్ కూడా యాడ్ అవ్వడంతో ప్రాజెక్టు వెయిట్ పెరిగింది.

ఈ నెలలో థియేటర్లలోకి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు ధమాకా. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఇవి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తోంది ఈ సినిమా. సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది. పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 2 ఫ్లాపులు అందుకున్న రవితేజ, ధమాకాతో ఎలాగైనా హిట్ కొట్టి, 2022ను సక్సెస్ ఫుల్ గా ముగించాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలతో పాటు ఇదే నెలలో వస్తున్న అన్నీ మంచి శకునములే, లాఠీ సినిమాలపై కూడా ఆడియన్స్ దృష్టి ఉంది. స్వప్న సినిమాస్ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో “అన్నీ మంచి శకునములే” సినిమా ఆసక్తిని పెంచుతోంది. ఇక విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమ కోసం మాస్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల్లో ఏ మూవీ ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇస్తుందో చూడాలి.