ఓ పక్క ఊరిస్తున్న సంక్రాంతి..మరో పక్క భయపెడుతున్న కోవిడ్ మూడో ఫేజ్. ఈ రెండింటి నడుమ ఊగుతున్న సినిమాలు. ఇలాంటి నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమా డైరక్టర్ రాధాకృష్ణ వేసిన ట్వీట్ కాస్త నర్మ గర్భంగానే వుంది.
Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us – Our hopes are always High. Stay safe, stay high – Team #radheshyam
ఈ ట్వీట్ భావమేమి? వాయిదా దిశగా రాధేశ్యామ్ పయనిస్తోందనా? ఓటిటి బేరాలు సాగిస్తోందనా? మొత్తానికి పాపం, దర్శకుడు రాధాకృష్ణ మదిలో ఏదో బాధ సుడులు తిరుగుతోంది. ఇన్నాళ్ల తన స్వప్నం ముగింపు ఇలా వుందనే బాధ కావచ్చు.
నిజానికి రాధేశ్యామ్ మేకర్లు ఆ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతోనే వున్నారు. వారికి కూడా ఇది చాలా ప్రాణావసరం. వారికి వున్న ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సి వుంది. కానీ వీలు కాకపోతే పాపం వారు మాత్రం ఏం చేస్తారు.
ఈ ఫ్రస్టేషన్ నే దర్శకుడు రాధా చేత ఈ ట్వీట్ వేయించాయేమో?