మాట్లాడుకోవడానికి కూడా కాల్షీట్ కావాల్సిందే!

క్రేజ్ ఉన్నప్పుడు కొన్ని త్యాగం చేయక తప్పదు. మరీ ముఖ్యంగా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కు దూరమవ్వడం గ్యారెంటీ. ఇదే విషయాన్ని హీరోయిన్ దీపిక పడుకోన్ చెబుతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మంచి…

క్రేజ్ ఉన్నప్పుడు కొన్ని త్యాగం చేయక తప్పదు. మరీ ముఖ్యంగా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కు దూరమవ్వడం గ్యారెంటీ. ఇదే విషయాన్ని హీరోయిన్ దీపిక పడుకోన్ చెబుతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మంచి క్రేజ్ లో ఉంది. అటు ఈమె భర్త రణ్వీర్ సింగ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు.

దీంతో తామిద్దరం కలుసుకోవడానికి అస్సలు టైమ్ దొరకడం లేదని చెబుతోంది దీపిక. అందుకే కాల్షీట్లు కేటాయించినప్పుడే, తామిద్దరం మాట్లాడుకోవడానికి కూడా షెడ్యూల్స్ కేటాయించుకుంటున్నామని తెలిపింది.

ఒక రోజులో వీళ్లిద్దరూ కలుసుకునేది చాలా తక్కువ సమయమంట. ఆ తక్కువ సమయంలోనే క్వాలిటీ లైఫ్ ను తాము ఆస్వాదిస్తామని చెబుతోంది దీపిక. ఒక్కోసారి రోజుల తరబడి కలుసుకోవడం కుదరదని, అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుందని, ఇక తమలో ఎవరికైనా ఫారిన్ షెడ్యూల్స్ పడితే, ఆ బాధ వర్ణనాతీతం అంటోంది.

ఈరోజు ఈ జంట తమ 5వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన కొన్ని స్టిల్స్ తో పాటు, రామ్ లీల సినిమా షూటింగ్ టైమ్ లో దిగిన కొన్ని ఆన్-లొకేషన్ స్టిల్స్ ను ఈ జంట విడుదల చేసింది.

అటు ఐదేళ్ల వైవాహిక జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా కొన్ని ఇఁటర్వ్యూలు కూడా ఇచ్చింది దీపిక పదుకోన్. గతంలో ఎదుర్కొన్న ట్రోలింగ్స్, రణ్వీర్ తో లవ్ లైఫ్ పై స్పందించింది. ఇందులో భాగంగానే తామిద్దరం కలుసుకోవడానికి అస్సలు టైమ్ దొరకడం లేదని, మాట్లాడుకోవడానికి కూడా షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకోవాల్సి వస్తోందని వెల్లడించింది.