అనుపమ పరమేశ్వరన్ “అ…ఆ”తో టాలీవుడ్లో సహాయ నటిగా తెరంగేట్రం చేసి… ఆ తర్వాత హీరోయిన్గా ప్రమోషన్ పొందారు. చూడ చక్కని రూపం, చలాకీగా ఉంటూ నవ్విస్తూ, కవ్విస్తూ నటించే ఆ హీరోయిన్‌కు చెప్పుకో తగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతా డిలీట్ అయింది. దీనికి కారణం ఆమె ఫేస్బుక్ హ్యాక్ కావడమే. హ్యాకర్లు ఆమె ఫేస్‌బుక్‌లోకి చొరబడి ఇష్టానుసారం చేయడం ప్రారంభించారు. అనుపమ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
దీన్ని పసిగట్టిన అనుపమ సెక్యూరిటీ కారణాల రీత్యా తన ఖాతాను డిలీట్ చేశారు. అనంతరం ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. మార్ఫింగ్ ఫొటోను, ఒరిజనల్ ఫొటోను షేర్ చేస్తూ….”ఇది ఫేక్…ఇలాంటి చెత్త పనులు చేయడానికి చాలా సమయం దొరికినట్లుంది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి ఫొటోలు షేర్ చేయవద్దని, ఇలాంటివి తన ఆవేదనకు గురి చేస్తున్నాయని ఆమె వాపోయారు. ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.