తెలంగాణలో కొత్తగా మరో 16 కేసులు

తెలంగాణలో ఈరోజు కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 430కి చేరింది. ఈరోజు ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. ఎవర్నీ డిశ్చార్జ్…

తెలంగాణలో ఈరోజు కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 430కి చేరింది. ఈరోజు ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. ఎవర్నీ డిశ్చార్జ్ కూడా చేయలేదు.

తెలంగాణలోని ప్రతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 179 యాక్టివ్ కరోనా కేసులున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా నిజామాబాద్ లో 49, రంగారెడ్డిలో 27, వరంగల్ అర్బన్ లో 23 కేసులున్నాయి. కరీంనగర్ లో ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. అక్కడ 7 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. మహబూబ్ నగర్, సిద్ధిపేట్, సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతానికి కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఛాయలు కనిపించలేదని స్పష్టంచేసిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 101 హాట్ స్పాట్స్ ను గుర్తించింది. వీటిపై ప్రత్యేకంగా నిఘా ఉంచి, అదనపు ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల్ని నిర్థారించేందుకు 6 ల్యాబులు 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపింది.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇకపై అందరూ విధిగా బయటకు వచ్చేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంట్లో తయారుచేసిన మాస్కుల్ని కూడా అనుమతిస్తామని స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఇప్పటికే నిషేధించింది తెలంగాణ ప్రభుత్వం.

ఎన్నికల కమిషనర్ ని అందుకే మార్చేసాం