హార్రర్ మూవీ లవర్స్ కోసం డీ మాంటీ కాలనీ 2

సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ”కి సీక్వెల్ గా తెరకెక్కింది “డీమాంటీ కాలనీ 2”. అరుల్ నిధి, ప్రియ భవానీశంకర్, అన్టి జస్కేలినెన్, సెరింగ్ డోర్జ్, అరుణ్ పాండియన్ కీలక పాత్రల్లో నటించిన…

సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ”కి సీక్వెల్ గా తెరకెక్కింది “డీమాంటీ కాలనీ 2”. అరుల్ నిధి, ప్రియ భవానీశంకర్, అన్టి జస్కేలినెన్, సెరింగ్ డోర్జ్, అరుణ్ పాండియన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు. శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై యన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి సురేష్ రెడ్డి, మానస రెడ్డి డీమాంటీ కాలనీ 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది.

ఈ వారం రిలీజైన చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది డీమాంటీ కాలనీ 2. సినీ ప్రియులు, హారర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూసేందుకు వెళ్తున్నారు. ఈ నెల 15న తమిళనాట విడుదలై ఘన విజయాన్ని సాధించిన డీమాంటీ కాలనీ 2 తెలుగులోనూ మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది.

సినిమా కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ కు మూడు రోజుల ముందు నుంచే డీమాంటీ కాలనీ 2 పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు తెలుగు నిర్మాతలు బి.సురేష్ రెడ్డి, మానస రెడ్డి. రిలీజ్ డే ముందు రాత్రి వరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ స్క్రీనింగ్ అ‌వుతూనే వచ్చాయి. ఈ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఆడియెన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమా మీద అంచనాలు పెంచింది. అందుకే నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓ సూపర్ హిట్ సినిమాకు కావాల్సినంత పేరు తెచ్చుకుంది.

ప్రేక్షకుల రెస్పాన్స్ తో పాటు క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంటోంది డీమాంటీ కాలనీ 2. ఈ క్రేజ్ తో ఈ వారం రిలీజైన చిత్రాల్లో డీమాంటీ కాలనీ 2 సినిమానే సెలెక్ట్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాకు ఈ రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెరిగాయి.

7 Replies to “హార్రర్ మూవీ లవర్స్ కోసం డీ మాంటీ కాలనీ 2”

Comments are closed.