Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవర.. బిగ్ షాట్స్ ఎందుకు వదిలేస్తున్నారు?

దేవర.. బిగ్ షాట్స్ ఎందుకు వదిలేస్తున్నారు?

కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్ దేవర సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు సితార సంస్థ నాగవంశీ తీసుకుంటున్నారని గ్యాసిప్ లు గుప్పుమన్నాయి. కానీ ఇలాంటి డీల్స్ చేసే బడా సంస్థలు ఎందుకు ఈ విషయంలో దూరంగా వున్నాయి అన్నది పెద్ద అనుమానం.

ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమాలు అన్నీ చేసే దిల్ రాజు విశాఖ- నైజాం ఏరియాలు వదులు కోరు. నాగవంశీ తీసుకున్నా దిల్ రాజుకే వస్తాయి ఈ ఏరియాలు. కానీ దిల్ రాజునే ఇలా హోల్ సేల్ గా తీసుకుని, తన టీమ్ అందరితో పంచుకోవచ్చు కదా. మరి ఎందుకు ఆ పని చేయలేదు.

దిల్ రాజు దగ్గరకు 130 కోట్ల ఆఫర్ వచ్చిందని, కానీ ఆయన అంత రేటు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. 110 నుంచి 115 కోట్ల వరకు దిల్ రాజు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకన్నా ముందు ఈ ఆఫర్ ఆసియన్ సినిమాస్ దగ్గరకు వెళ్లింది. వాళ్లు కేవలం నైజాం, అది కూడా 40 కోట్ల ఎన్నారైకి చేయడానికి తప్ప, టోటల్ రెండు రాష్ట్రాలు టేకప్ చేయడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.

ఇక మిగిలింది, ఇటు ఎన్టీఆర్ కు, అటు కొరటాలకు సన్నిహితంగా వుండే మైత్రీ సంస్థ ఈ విషయంలో ఎందుకు మౌనంగా వుండిపోయింది అన్నది కాస్త సందేహమే. ఇలాంటి టైమ్ లో నాగవంశీ 120 కోట్ల మేరకు ఆఫర్ ఇచ్చి, దాదాపుగా ఓరల్ గా డీల్ క్లోజ్ చేసారని టాక్.

కొంత కాలంగా టాలీవుడ్ లో ఓ కొత్త టెక్నిక్ మొదలైంది. ఎవరో ఒకరు హొల్ సేల్ గా కొన్నట్లు చూపించి, మార్కెట్ చేయడం. ఇది అలాంటిదా? లేక, ఫ్యాన్సీ డీల్ నా? అన్నది క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. ఎందుకంటే ఈ డీల్ వల్ల నాగవంశీ కేవలం బ్యానర్ నేమ్ యాడ్ చేసుకోవడం తప్ప సాధించేది పెద్దగా వుండకపోవచ్చు. ఆరంభంలోనే చేతికి కొంత తగిలినా తగలవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?