Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇది మేనిఫెస్టోనా? వేలంపాటనా?

ఇది మేనిఫెస్టోనా? వేలంపాటనా?

చంద్రబాబునాయుడు తనను తాను మహిమాన్వితుడిగా భావించుకుంటూ ఉంటారు. నలభై నాలుగేళ్ల సీనియారిటీ తనది అని చెప్పుకుంటారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మహానుభావుడిని తాను అని చెప్పుకుంటారు. మరి.. అంత గొప్ప నాయకుడికి.. సొంతంగా ఒక్క ఆలోచనను ప్రకటించడానికి చాలినంత ఆలోచనగానీ, బుద్ధి గానీ లేవా? అనేది ఎన్డీయే కూటమి మేనిఫెస్టో గమనించిన ప్రజలకు కలిగేు మొదటి సందేహం.

కాపీ ఆలోచనలు, కాపీబుద్ధులతో నింపేసిన మేనిఫెస్టోను చంద్రబాబునాయుడు ప్రకటించారు. నిజం చెప్పాలంటే.. అది మేనిఫెస్టో కానే కాదు.. కేవలం వేలం పాట మాత్రమే అని ప్రజల చీదరించుకునేలా అది ఫైనల్ గా బయటకు వచ్చింది.

చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రకటించి ఏడాది అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన కబుర్లలోనూ ప్రధానమైనవి ఆ సూపర్ సిక్స్ మాత్రమే. వాటితో జతకలిసినవి అతి కొద్ది మాత్రమే.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలనెలా డబ్బు, నిరుద్యోగ భృతి ఇలాంటివన్నీ కొత్తవేం కాదు. ఎక్కడో ఒకచోట నుంచి కాపీ కొట్టిన పథకాలే. అవికాకుండా తతిమ్మా అన్నీ కూడా.. జగన్ తన సొంత ఆలోచన నుంచి ప్రారంభించిన సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా, వేలం పాటలాగా కాస్త బేరం పెంచి ప్రకటించిన పథకాలు మాత్రమే.

గతంలో తెలుగుదేశం హయాంలో రెండు వేలుగా ఉన్న పింఛనును, జగన్ తాను అధికారంలోకి వచ్చాక మూడు వేలు చేశారు. దానిని నాలుగువేలు చేస్తానని చంద్రబాబు అంటున్నారు. అలాగే రైతులకు ఆర్థిక సాయం కూడా 20వేలకు పెంచుతానని అంటున్నారు.

ఇలా ఇప్పటికే సూపర్ సిక్స్ ద్వారానే మేనిఫెస్టో అంటే.. రాజకీయం అంటే.. ప్రజల ఓట్లను వేలం పాట ద్వారా కొనుగోలు చేయడం అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. తనకు సొంతంగా ఒక్క సంక్షేమ ఆలోచన లేకపోయినా.. జగన్ చేసే పనులకు కాస్త డబ్బు పెంచి జనం ఓట్లను కొనాలనుకుంటున్న బుద్ధి ఆయనది.

తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా కీలకమైన రెండు అంశాలను గమనిస్తే.. ఆయనలో వేలం పాట ద్వారా ఓట్లు కొనే బుద్ధి తప్ప మరొకటి లేదని అర్థమవుతుంది.

వాలంటీర్లకు రూ.5వేల జీతాలు వస్తోంటే వేలంపాట పడి పదివేలు చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణుల వేతనాల్ని 20వేలకు పెంచుతానని జగన్ ప్రకటించగా, తమ కూటమి అధికారంలోకి వస్తే 25 వేలుగా చేస్తాం అంటూ.. చంద్రబాబు పైపాట బేరం పెట్టారు.

అలాగే జూనియర్ న్యాయవాదులకు జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వరం ప్రకటించారు. వారికి నెలకు 5వేల వంతున లా నేస్తం అందిస్తున్నారు. ఈ పథకం మీద కూడా చంద్రబాబునాయుడు వేలం పాట పెట్టి.. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూ.న్యాయవాదులకు నెలకు పదివేల వంతున చెల్లిస్తాం అని చెబుతున్నారు.

ఇలా కేవలం వేలం పాట బుద్ధులతో ఆయన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? సొంత ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని ప్రజలు చీదరించుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?