దేవర – ముందు నువ్వెంత – అనిరుధ్

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’ కొన్ని రోజుల కిదంట గ్లింప్స్ వదిలారు. ఇప్పుటు టైటిల్ సాంగ్ వదిలారు. ఆల్ హైల్ అంటూ. యువ సంగీత సంచలనం…

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’ కొన్ని రోజుల కిదంట గ్లింప్స్ వదిలారు. ఇప్పుటు టైటిల్ సాంగ్ వదిలారు. ఆల్ హైల్ అంటూ. యువ సంగీత సంచలనం అనిరుధ్ స్వరపర్చిన సాంగ్. పాట సౌండింగ్ అంతా బాగుంది. పక్కా అనిరుధ్ స్టయిల్ లో వుంది. అందులో అస్సలు సందేహం లేదు. కానీ రచయిత రామజోగయ్య శాస్త్ర్రి ఏం రాసారు అన్నది మాత్రం అంత సులవుగా అంతుపట్టకుండా వుంది. మ్యూజిక్ సౌండ్ అంతలా డామినేట్ చేసింది.

అక్కడక్కడ కొన్ని లైన్లు వినిపిస్తున్నాయి తప్ప పాట అంతా కాదు. కచ్చితంగా లిరిక్స్ బాగానే అందించి వుంటారు. కొరటాల శివ- రామ జోగయ్య శాస్త్రి కాంబినేషన్లో అనేక మంచి పాటలు వచ్చాయి. అవి కూడా మంచి హీరోచిత గీతాలు వున్నాయి. అందువల్ల లిరిక్స్ ఎలా వున్నాయి అనే సందేహం అక్కర లేదు. కానీ ఎటొచ్చీ ఈ సౌండ్ రొద లో ఆ లిరిక్స్ వినిపించడం లేదు. అదే ట్రెండ్ అంటే చేసేదేమీ లేదు.

ఇక మరోపాయింట్ ఏమిటంటే, ఫ్యాన్స్ అంతా ఈ లిరికల్ విడియోను చూసేది ఎన్టీఆర్ కోసం. ఎన్టీఆర్ దేవరగా చేసే స్టయిల్ కోసం. కానీ పాట ఆరంభం నుంచి చివరి వరకు అనిరుధ్ విన్యాసాలతో నింపేసారు. అనిరుధ్ గెటప్ లు, డ్యాన్స్ లు, లుక్ లు, స్టయిల్ ఇది ఎక్కువ. ఎన్టీఆర్ ను చూపించింది తక్కువ అయింది. అయితే అనిరుధ్ ఎన్ని చేసినా ఎన్టీఆర్ లుక్స్ వేరే లెెవెల్ కనుక సరిపెట్టుకోవచ్చు.