భారీ సినిమా అనగానే నిర్మాణం కన్నా విడుదల డేట్‌నే సమస్యగా మారుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్ దేవర, బన్నీ పుష్ప 2 ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అన్న అంచనానే తప్ప క్లారిటీ లేదు.
ప్రతి సినిమా ఏదో ఒక డేట్ అనౌన్స్ చేసి వున్నా, ఆ డేట్‌కు రావడం అన్నది మాత్రం సాధ్యం కాని పని అని అందరికీ తెలుసు. భారీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అన్నీ సిజి వర్క్ కీలకంగా వుంటున్నవే. సిజి వర్క్ మీద ఆధారపడ్డారు అంటే చాలు, సినిమా విడుదల డేట్ మీద క్లారిటీ మర్చి పోవాల్సిందే.
ఎంత వెంటపడి తరిమినా, సిజి వర్క్ లు టైమ్ రావు. వచ్చిన తరువాత క్వాలిటీ చెకింగ్, తాము అనుకున్నట్లు, వేసుకున్న స్టోరీ బోర్డ్ కు అనుగుణంగా, పూర్తి క్వాలిటీతో వచ్చాయా లేదా అన్నది ఓ సమస్య. అలా కాకుంటే మళ్లీ డిస్కషన్లు, మళ్లీ వర్క్ స్టార్ట్. అందువల్ల డేట్ అన్నది క్లారిటీ వుండదు. దీనికి తోడు ప్రతి సినిమాకు పెద్ద మ్యూజిక్ డైరక్టర్ లను తీసుకుంటారు. వీళ్లు ఫుల్ బిజీ. ఒకంతట వర్క్ ఇవ్వరు.
అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరక్టర్ అయితే నిర్మాత, దర్శకులను ఏడిపించేస్తారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. అనిరుధ్ ను పెట్టుకుంటే క్లాలిటీ సంగతి అలా వుంచి, వర్క్ తీసుకోవాలి అంటే నరకం చూసేసినట్లే అని టాక్ వుంది. ఈ ప్రీ సమ్మర్ లో, పోస్ట్ సమ్మర్ లో ఎన్టీఆర్ దేవర, బన్నీ పుష్ప 2 విడుదల కావాల్సి వుంది. దేవర సినిమా పోస్ట్ పోన్ అని అనధికారికంగా వార్తలు వచ్చేసాయి. కానీ మళ్లీ కొత్త డేట్ ఎప్పుడు? పుష్ప 2 రాకపోతే అది వేసుకున్న డేట్ కు ఆగస్ట్ లో రావాలని ఓ ప్లాన్. లేదూ అంటే సెప్టెంబర్ కు వెళ్లాలని మరో ప్లాన్.
దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ కు ఆపరేషన్ జరగడంతో ఎప్పుడు సెట్ కు వస్తారో క్లారిటీ లేదు. పుష్ప 2 సినిమాకు దర్శకుడు సుకుమార్. ఆయన ఒకంతట రాజీ పడరు. వర్క్ అంతా అయ్యాక అప్పుడు విడుదల సంగతి అంటారు. అందువల్ల రిలీజ్ డేట్ వేసారు కానీ అదీ క్లారిటీ లేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 రాకుంటే దేవర ఆ డేట్ ను తీసుకుంటుంది. పుష్ప 2 తనకు కలిసి వచ్చిన డిసెంబర్ కు వెళ్లిపోతుంది. ఈ రెండు భారీ సినిమాల సంగతులు ఈమాత్రమైనా వినిపిస్తున్నాయి. కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఎక్కడుందో, ఎప్పటికి రెడీ అవుతుందో కొంచెం కూడా సమాచారం లేదు.