Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవీ రాసి..దేవీ పాడిన..దేవీ ట్యూన్

దేవీ రాసి..దేవీ పాడిన..దేవీ ట్యూన్

మెగాస్టార్ లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య… పవర్ బాబీ డైరక్షన్..మైత్రీ తో కలిసి జికె మోహన్ సహనిర్మాణం. ఈ సినిమా నుంచి తొలిపాట ను విడుదల చేసారు. ఇది సినిమాలో స్పెషల్ సాంగ్ నో..ఐటమ్ సాంగ్ నో…లేదా ఇంటడ్రక్షన్ సాంగ్ నో. దేనికైనా వాడుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేసారు. ఈ పాట కోసం చాలా అంటే చాలా విశాలమైన, భారీ సెట్ వేయడం విశేషం.

దేవీశ్రీ రాసిన, దేవీ మ్యూజిక్ చేసిన, దేవీనే పాడిన పాట ఇది. అన్నీ రెడీ చేసుకోండి బాసొచ్చిండు అనే మీనింగ్ లో సాగుతుందీ పాట. దేవీతో సమస్య ఏమిటంటే పాట ఇన్ స్టాంట్ హిట్ అన్నది వుండదు. వినగా..వినగా ఎక్కే టైపు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ పాట మీద జడ్జ్ మెంట్ అన్నది కష్టం. కానీ ఒక సమస్య వుంది. ప్రతి దానికీ ఈడే దూరిపోతాడు అన్నట్లుగా దేవీ చేస్తుంటాడు.

దేవీ శ్రీ ప్రసాద్ తానే రాసేస్తాడు..పాడేస్తాడు..అన్నీ. అదే సమస్య. దాని వల్లే మొనాటమీ వస్తుంది. కొత్తగా ఆలోచించాలి. కొత్తగా రాయించాలి. కొత్తగా చేయాలి. అప్పుడు ఈ సమస్య, ట్రోలింగ్ వుండదు. కానీ దేవీశ్రీకి అవేం పట్టవు. తన స్టయిల్ తనదే.

ఈ విషయం పక్కన పెడితే పాట కోసం ఆర్ట్ డైరక్టర్ ప్రకాష్ వేసిన సెట్ బాగుంది. మెగాస్టార్ గతంలో ముఠామేస్త్రీని గుర్తు తెచ్చేలా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసారు. అదే గెటప్ కాస్త కాస్ట్ లీ రీమిక్స్ అనేట్లు సుస్మిత కొణిదెల డ్రెస్ డిజైన్ చేసారు. వీడియో బిట్లు, స్టిల్స్, వర్కింగ్ విడియో అన్నీ కలిపి అందించారు కనుక, ఫుల్ వీడియో సాంగ్ వస్తే మజా వేరుగా వుంటుంది. పైగా దానికి ఊర్వశీ రౌతాలా అందాలు కూడా తోడవుతాయి కదా. మైత్రీ ఈ సినిమా కోసం కాస్త భారీగా ఖర్చు చేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?