అల వైకుంఠపురములో తరువాత ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా.. థమన్.. థమన్ .. థమన్. అదే టైమ్ లో సరైన ఆల్బమ్ లు ఇవ్వక దేవీశ్రీప్రసాద్ పేరు ఒక్కసారిగా వినిపించడం ఆగిపోయింది.
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు కూడా ఉప్పెన సంగతి మరిచిపోయి మొహం చాటేసి ఏకంగా రెహమాన్ దగ్గరకు వెళ్లిపోయారు. దేవీతోనే ప్రయాణం సాగించిన పలువురు థమన్ ను దగ్గరకు తీసారు. పాపం, దేవీ మాత్రం సైలంట్ గా వుండిపోయాడు.
కానీ ఇప్పుడు చూస్తుంటే టేబుల్ మళ్లీ టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కొక్కరు దేవీ ని దగ్గరకు తీస్తున్నారు. దేవీని వదలని దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, లాంటి వాళ్ల సినిమాలు ఎలాగూ వున్నాయి. అవి కాక మళ్లీ కొత్త ప్రామిసింగ్ ప్రాజెక్ట్ లు కూడా చేతిలోకి వస్తున్నాయి. మంచి పాటలు చేయించుకునే శేఖర్ కమ్ముల, క్రాంతి శేఖర్ లాంటి దర్శకులు సినిమా ఒకటి దేవీ దగ్గరకే వస్తున్నాయి.
లేటెస్ట్ గా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చందుమొండేటి-నాగ్ చైతన్యల తండేల్ సినిమా కూడా దేవీ శ్రీ ప్రసాద్ దగ్గరకే వెళ్తోందని తెలుస్తోంది. ఇవి కాక ఇంకా రెండు మూడు పెద్ద ప్రాజెక్ట్ లకు దేవీ ని కాంటాక్ట్ చేస్తున్నారు. కేవలం ఇగో వల్ల ఎవరైనా దూరం పెట్టినంత మాత్రాన టేబుల్ టర్న్ కాకుండా వుండదు కదా?