మన హీరోలు వేరే భాషల్లో సినిమాలు విడుదల చేస్తూ కూడా అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కొంచెం ముందు వెనుక ఆడుతున్నారు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన హీరోయిన్లు, హీరోలు మన దగ్గర డబ్బింగ్ చెప్పేస్తున్నారు. మమ్ముట్టి, సాయిపల్లవి లాంటి వాళ్లు డబ్బింగ్ అవసరం లేకుండా ఓన్ వాయిస్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ధనుష్ కూడా ఈ జాబితాలో చేరాడు.
తొలిసారి ధనుష్ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ అనే సినిమా దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటానని ధనుష్ ముందుకు వచ్చాడట.
ఎడ్యుకేషన్ సిస్టమ్, కమర్షియలైజేషన్ వంటి వ్యవహారాల నేపథ్యంలో వెంకీ ఈ కథను రాసుకున్నారు. ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారట. గెటప్ లు అంటే మరేం కాదు, కథాగమనం ప్రకారం ఏజ్ లుక్స్ ను బట్టి వచ్చే చేంజెస్ తో పాటు ఓ సర్ప్రయిజ్ లుక్ కూడా వుంటుందని తెలుస్తోంది.
దసరా కు సర్ సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా మరో తెలుగు సినిమాను శేఖర్ కమ్ములతో చేయడానికి ధనుష్ ఓకె చేసారు.