Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగ‌చైత‌న్య‌, స‌మంత దారిలో...మ‌రో జంట‌

నాగ‌చైత‌న్య‌, స‌మంత దారిలో...మ‌రో జంట‌

మ‌న‌కు బాగా సుప‌రిచిత‌మైన మ‌రో జంట వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. ఇటీవ‌ల కాలంలో బ్రేక‌ప్ వార్త‌లు త‌ర‌చూ తెర‌పైకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. భార్యాభ‌ర్త‌లు, ప్రేమికుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌లో త‌లెత్తుతున్న వైఫ‌ల్యాల్ని ఈ తెగ‌దెంపులు ప్ర‌తిబింబిస్తున్నాయి. జీవితాంతం క‌లిసి వుంటామ‌ని ఎన్నెన్నో ప్ర‌మాణాలు చేసుకుని, మూడు ముళ్లు, ఏడ‌డుగులతో న‌డ‌క ప్రారంభించే జంట‌లు... చివ‌రి మ‌జిలీ చేర‌కనే అర్ధాంతరంగా విడిపోతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌, అలాగే యూట్యూబ్ స్టార్స్ దీప్తి సున‌య‌న‌-ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ బ్రేక‌ప్ షాక్ నుంచి ఇండ‌స్ట్రీ తేరుకోక‌నే, మ‌రో సెల‌బ్రిటీ జంట అదే బాట ప‌ట్టింది. త‌మిళ న‌టుడు ధ‌నుష్‌, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య జంట విడిపోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మేర‌కు వాళ్లిద్ద‌రూ ఒకే ప్ర‌క‌ట‌న‌ను వ్య‌క్తిగ‌తంగా త‌మ పేర్ల‌తో ట్విట‌ర్ వేదిక‌గా బ్రేక‌ప్ వార్త‌ను పంచుకోవ‌డం విశేషం. 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్టు వాళ్లిద్ద‌రూ ప్ర‌క‌టించారు. బ్రేక‌ప్ ప్ర‌క‌ట‌న ఏంటంటే...

"స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి. దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం, మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో"  అంటూ వారు ట్వీట్ చేశారు.

విడిపోవ‌డానికి కార‌ణాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. త‌మ‌ను తాము అర్థం చేసుకోడానికి కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని పేర్కొన‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక విడిపోయిన త‌ర్వాత అర్థం చేసుకుంటే ఏంటి లాభ‌మ‌నే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. నాగ‌చైత‌న్య‌, స‌మంత లాగా త‌మ‌కు త‌గిన ప్రైవ‌సీ ఇవ్వాల‌ని ధనుష్‌, ఐశ్వ‌ర్య జంట కూడా కోర‌డం విశేషం. ఇదిలా వుండ‌గా ఈ జంట‌కు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?