ఆ పాట యూట్యూబ్లో విడుదలై తొమ్మిది గంటలు గడిచింది. వ్యూస్ ఎన్ని వచ్చి ఉంటాయో ఒక్కసారి ఊహించండి…లక్ష, రెండు లక్షలు…ఊహూ, కానే కాదు. అక్షరాలా ఆ పాట 25 లక్షల వ్యూస్ సంపాదించింది. దీన్ని బట్టి ఆ పాట సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతుంటుందో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్న ఆ పాటే ‘దిల్ కో కరార్ ఆయా’. యూ ట్యూబ్ను షేక్ చేస్తున్న ఆ పాట సంగతేంటో తెలుసుకుందాం. చిన్నారి పెళ్లి కూతురు నటుడు శివ(సిద్దార్థ్ శుక్లా), నేహా శర్మల మధ్య రొమాంటిక్, ఎమోషనల్ సాంగే ‘దిల్ కో కరార్ ఆయా’. ఈ పాట శుక్రవారం విడుదలైంది. ఇక ఆ పాట అభిమానుల ఆదరణను చూరగొంటూ రాకెట్లా దూసుకుపోతోంది. కేవలం తొమ్మిది గంటల వ్యవధిలోనే 25 లక్షల వ్యూస్ సంపాదించింది.
సిద్దార్థ్ శుక్లా తన అభిమానుల కోసం ట్విటర్లో ‘దిల్ కో కరార్ ఆయా’ పాటను షేర్ చేశారు. ‘దీనిని మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నాను… ఈ పాటపై మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. శుక్లా, నేహా అభిమా నులతో పాటు సంగీత ప్రియుల్ని ఆ రొమాంటిక్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రతి నిమిషానికి వేలల్లో చూస్తున్నారు. శుక్లా కోరినట్టు నెటిజన్లు తమను ఫిదా చేసిన పాట గురించి ఎంతో పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. పాటలో దమ్ము ఉంటే ఎవరూ చెప్పాల్సిన పనిలేకుండానే….దానికదే అలా దూసుకుపోతుంటుంది.