హనీమూన్ కు ఎవరైనా ఒకసారే వెళ్తారు. కానీ హీరోయిన్ దియా మీర్జా మాత్రం తన జీవితంలో రెండోసారి హనీమూన్ కు వెళ్లింది. ఎందుకంటే ఆమె గత నెల రెండో పెళ్లి చేసుకుంది కాబట్టి. ఫిబ్రవరిలో వ్యాపారవేత్త వైభవ్ రేఖిని పెళ్లాడింది దియామీర్జా. ఇప్పుడీ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో ల్యాండ్ అయింది.
ముంబయికి చెందిన వైభవ్ రేఖిని గతనెల రహస్యంగా పెళ్లాడింది దియా. వాళ్లిద్దరి పెళ్లి చాలా గుంభనంగా జరిగిపోయింది. ఇంతకుముందు సాహిల్ సంఘ అనే బిజినెస్ మేన్ ను పెళ్లాడిన దియా.. అతడితో 11 ఏళ్లు కాపురం చేసి 2019లో విడిపోయింది.
అలా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు వైభవ్ ను పెళ్లాడింది. మాల్దీవులు హనీమూన్ కు చెందిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దియా.. ఈ ఫొటోలు అతడే తీశాడంటూ క్యాప్షన్ పెట్టింది.
నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమా చేసింది దియా మీర్జా. ఓవైపు నాగార్జునతో సహా సినిమా యూనిట్ అంతా మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంటే.. దియా మాత్రం ఇలా మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం దియా మూడ్ చూస్తుంటే.. వైల్డ్ డాగ్ ప్రమోషన్ కు ఆమె దూరమయ్యేలా ఉంది.