Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ కల్యాణ్ మార్కు ఇంటర్వ్యూ రెడీ

పవన్ కల్యాణ్ మార్కు ఇంటర్వ్యూ రెడీ

వకీల్ సాబ్ రిలీజ్ టైమ్ కు పవన్ కల్యాణ్ మీడియా ముందుకొస్తాడా? మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తాడా? ఈ ప్రశ్నకు కాస్త తొందరగానే సమాధానం దొరికేసింది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ కోసం పవన్ ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చేశాడు. 

పవన్ ఆమోదించిన కొన్ని ప్రశ్నలతో, ఓ ఫిమేల్ యాంకర్ తో ఈ ఇంటర్వ్యూను జస్ట్ గంటలో పూర్తిచేశారు. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి రీసెంట్ గా డబ్బింగ్ పూర్తిచేశాడు పవన్. అదే ఊపులో అతడితో ఓ గంట ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు దిల్ రాజు. 

సినిమా రిలీజ్ కు, పవన్ తో చేయాల్సిన ప్రచారానికి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. ఆ సమయానికి పవన్ అందుబాటులో ఉంటాడో ఉండడో ఎవ్వరికీ తెలియదు. మరీ ముఖ్యంగా అప్పటికి పవన్ మూడ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు.

అందుకే దిల్ రాజు తెలివిగా డబ్బింగ్ గ్యాప్ లో పవన్ తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. ఇంటర్వ్యూ అయితే పూర్తయింది. ఎడిటింగ్ చేయాల్సి ఉంది. దీన్ని ఎప్పుడు మీడియాకు వదుల్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

మరో 3 రోజుల్లో వకీల్ సాబ్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఆ తర్వాత 4 రోజుల గ్యాప్ లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది వకీల్ సాబ్ మూవీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?