దిల్ రాజు దాచిన సత్యం

నిర్మాత..డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వూలు ఇచ్చారు. దాని ప్రోమో బయటకు వచ్చింది. తాను మోనోపలీ చేస్తున్నాననెే వార్తలను దిల్ రాజు ఆ ఇంటర్వూలో ఖండించారు. కేెవలం 37 థియేటర్లలతో…

నిర్మాత..డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వూలు ఇచ్చారు. దాని ప్రోమో బయటకు వచ్చింది. తాను మోనోపలీ చేస్తున్నాననెే వార్తలను దిల్ రాజు ఆ ఇంటర్వూలో ఖండించారు. కేెవలం 37 థియేటర్లలతో మోనోపలీ చేయగలనా? అని ఆయన ప్రశ్నించారు. దీని మీద టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ దిల్ రాజు 37 థియేటర్లు కీలకమే. అలాగే ఇంకో విషయమూ వుంది. ఎలా అంటే..

దిల్ రాజుకు 37 థియేటర్లు వున్నది ఉత్తరాంధ్రలో. టాలీవుడ్ కు నైజాం తరువాత కీలకమైన ఏరియా ఉత్తరాంధ్ర. కొన్ని సినిమాలకు నైజాంతో సమానమైన బిజినెస్ జ‌రుగుతోంది. ఇక్కడ దిల్ రాజు దే ఆధిపత్యం. ఇది ఒక పాయింట్. ఇదిలా వుంటే..దిల్ రాజు అంటే సోలో కాదు. ఓ సిండికేట్ వ్యవస్థ. అది అత్యంత కీ రోల్ ప్లే చేస్తోంది.

ఈస్ట్ సత్యనారాయణ, వెస్ట్ ఎల్ వి ఆర్, గుంటూరు, నెల్లూరు, కర్నూలు యువి, కృష్ణ గీతా, నైజాం ఆసియన్ సునీల్ ఇలా అంతా దిల్ రాజుతో చేతులు కలిపి వున్నారు. వీరంతా ఓ మాట మీదే వుంటారు. వీరందరికీ దిల్ రాజు లీడర్ అన్నది ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. అందువల్ల అన్ని ఏరియాల్లో దిల్ రాజు సినిమాను శాసించగలరు అన్నది వాస్తవం. కానీ బయటకు కేవలం 37 థియేటర్లతో శాసించగలనా? అని అంటారు.

దిల్ రాజు ఓ నిర్ణయం తీసుకున్నా, ఓ మాట అన్నా అన్ని ఏరియాల్లో వున్న వీరంతా ఆయన వెంటే వుంటారు. అందువల్ల కచ్చితంగా అవతలి సినిమాను కంట్రోలు చేయడం సాధ్యం అవుతుంది అన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.