నిర్మాత..డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు ది ఎప్పుడూ ఒక సెపరేట్ రూట్. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్తారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఒకటి ఆయనే మొదలుపెట్టారు. వాటి ద్వారా ప్రకటనలు జారీ చేస్తూ ఆ కమిషన్ ను మళ్లీ నిర్మాతలకే వచ్చేలా చేసారు.
సినిమా విడుదలలను స్ట్రీమ్ లైన్ చేసారు. ఇప్పుడు సినిమా పబ్లిసిటీ విషయంలో కూడా ఆయన కొత్త పుంతలు తొక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా పబ్లిసిటీ అంటే టీవీ ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, హోర్డింగ్ లు, వగైరా..వగైరా..వాటితో పాటే మీడియా మీట్ లు, ఇంటర్వూలు.
ఈ ప్రకటనలు అన్నవి ఏ సినిమాకు ఆ సినిమాను బట్టి, బడ్జెట్ ను బట్టి, ఇచ్చే మీడియా సంస్థ పాపులారిటీని బట్టి వుంటాయి. పాపులారిటీ తక్కువ వున్నా కొన్ని మొహమాటాలు వుంటాయి. అందరినీ సమాదరించాలి అనే ఆలోచన కూడా వుంటుంది. ఇప్పుడు దిల్ రాజు ఈ మొహమాటాలు అన్నీ పక్కన పెడతారట. జస్ట్ ఫార్మల్ గా కొన్ని ప్రకటనలు జారీ చేసి ఊరుకుంటారు. అలాగే రెగ్యులర్ మీడియా కవరేజ్ మీద కన్నా సోషల్ మీడియా మీద ఎక్కువ దృష్టి పెడతారట.
ఇకపై పబ్లిసిటీ ఖర్చును బాగా తగ్గించాలన్నది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు మొదటి నుంచీ మీడియా వ్యవహారాలకు దూరంగానే వుండేవారు. ఎవడు సినిమా టైమ్ లో మళ్లీ మీడియా విషయంలో తన ఆలోచనలు మార్చుకున్నారు. ఆ తరువాత కొంత రెగ్యులర్ ఫార్మాట్ లో మరి కొంత ఆయన స్టయిల్ లో వెళ్లారు.
ఇటీవల ఆయన ఆఖరికి ఫైనల్ గా మీడియా విషయం కొత్త ఆలోచనలతో వెళ్లాలని డిసైడ్ అయ్యారట. త్వరలో రాబోయే ఎఫ్ 3 నుంచే ఈ కొత్త పద్దతులు మొదలు పెడతారేమో? ఎఫ్ 3 కి సంబంధించి ఇక రెగ్యులర్ ప్రెస్ మీట్ లు లాంటివి లేకుండా జస్ట్ ప్రెస్ రిలీజ్ లతో కొత్త ధోరణిలో వెళ్తారేమో చూడాలి.
సినిమా కంటెంట్ కోసం మీడియాలు అన్నీ అర్రులు చాస్తున్నాయి. ఇలా వదిల్తే అలా అంది పుచ్చుకుని ప్రచారం చేస్తున్నాయి. ఇంత ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంటే ఇంక పెయిడ్ పబ్లిసిటీ ఎందుకు అన్నది దిల్ రాజు ఆలోచన కావచ్చు.