Advertisement

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజు జాక్ పాట్ టైమ్

దిల్ రాజు జాక్ పాట్ టైమ్

డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టైమ్ మళ్లీ మొదలైంది. ఆ మధ్య కొంతకాలం నైజాంలో వేరేవేరే జనాలతో పోటీ ఎదురైంది. ఇప్పడు మళ్లీ సినిమాలు అన్నీ దిల్ రాజును వెదుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రెగ్యులర్ బ్యానర్ల నుంచి భారీ సినిమాలు అయిన ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ వుండనే వున్నాయి.

ఆయనకు దూరం అయిపోయింది అనుకున్న మైత్రీ మూవీస్ బ్యానర్ కూడా దగ్గరయింది. వేరే వాళ్లు చేస్తారు అనుకున్న పష్ప సినిమా కూడా దిల్ రాజు కే వచ్చింది. 

అది కూడా చాలా రీజనబుల్ రేటుకు వచ్చింది. 36 కోట్లకే పుష్ప నైజాం హక్కులు దిల్ రాజుకు దొరికాయి. మొదట్లో దీన్ని 45 కోట్ల దగ్గర కోట్ చేసారు. అలవైకుంఠపురములో ఫుల్ రన్ అమౌంట్ అది.  కానీ దిల్ రాజు దగ్గరకు వచ్చాక అది 36 దగ్గర ఫిక్స్ అయింది.

అఖండ సినిమా కూడా దిల్ రాజే చేసారు నైజాంకు. 10.50 కోట్లకు ఆయన నైజాం తీసుకున్నారు. తొలివారమే లాభాల్లోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఒక్క కొరటాల శివతోనే ప్రస్తుతం కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వుంది దిల్ రాజుకు. అది సెట్ అయిపోతే ఇక నైజాంలో ఆయనే కింగ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?