ఎత్తి ఎత్తి కాలేస్తే ఎంగిలాకులో పడిందని సామెత. అన్ని సినిమాల రిలీజ్ ను తన డిస్ట్రిబ్యూషన్లకు అనుకూలంగా ప్లాన్ చేయించే దిల్ రాజుకు తన సోదరుడి కుమారుడి స్వంత సినిమా విషయంలో మాత్రం సమస్య అయిపోతోంది. రౌడీ బాయిస్ సినిమా పూర్తి చేసి, ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని నెలలు గడిచిపోతున్నాయి. డేట్ దొరకడం లేదు.
సమస్య ఏమిటంటే చటుక్కున విడుదల చేసేయడం కాదు. అటు వారం ఇటు వారం గ్యాప్ కావాలి. సరైన పోటీ వుండకూడదు. వీలయితే సోలో విడుదల కావాలి. కానీ అదే దొరకడం లేదు. ఆర్ఆర్ఆర్ రావడం లేదని తెలిసిన వెంటనే 7న వేద్దాం అనుకున్నారు. కానీ ఎందుకో మనసు మార్చుకుని 14న రౌడీ బాయిస్ డేట్ కొట్టారు.
ఇప్పుడేమయింది. అదే డేట్ కు డిజె టుల్లు వస్తోంది. పక్కా యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా. డైలాగులు, సీన్లు మామూలుగా వుండవు. కుర్రకారుకు కేరింతలు కలిగించే డబుల్ మీనింగ్ లు, సింగిల్ మీనింగ్ లే అన్నీ. ఇప్పుడు ఇలాంటి సినిమా వచ్చి మీద పడుతోంది.
డిజె టుల్లుతో పాటు చాలా సినిమాలు డేట్ లు వేస్తున్నాయి. రాధేశ్యామ్ ఇంకా బరిలోనే వుంది. మరి ఇలాంటి టైమ్ లో మరి మళ్లీ వాయిదా అంటారో. లేక ముందుకు వస్తారో రౌడీ బాయిస్.