2024 సంక్రాంతి పోటీ వేడెక్కినట్లు కనిపిస్తోంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ ఇండియా సినిమాను సంక్రాంతి బరిలో దింపుతుతున్నట్లు ప్రకటించేసారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే వార్తను ధృవీకరిస్తూ అనౌన్స్ మెంట్ అధికారికంగా వచ్చింది. నిజానికి ఇలా డేట్ అనౌన్స్ చేయడం అన్నది చాలా గుట్టుగా వుంచాలనుకున్నారు మేకర్లు. ఎందుకంటే సంక్రాంతి డేట్ చాలా కీలకం. ఎవరు ప్రకటించేస్తారో అన్న అనుమానం కావచ్చు. ఇప్పుడు ఎలాగూ ప్రకటించేసారు.
మరి ఇప్పటి వరకు వార్తల్లోనే వుంటూ వస్తున్న రామ్ చరణ్-శంకర్ సినిమా విడుదల తేదీ సంగతి ఏమిటి? ఆ సినిమాను సంకాంతి బరిలో దింపాలన్నది దిల్ రాజు ఆలోచనగా ఇన్నాళ్లూ వినిపిస్తూ వస్తోంది. మరి రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగుతాయా? తెలుగు మార్కెట్ 100 కోట్లకు పైగా వున్న రెండు సినిమాలు ఒకేసారి ఢీకొంటాయా?
అధికారికంగా ముందు డేట్ ప్రకటించాం అన్న క్రెడిట్ ను ప్రాజెక్ట్ కే కొట్టేసినట్లే. ఇక దిల్ రాజు కు మిగిలిన ఆప్షన్ 2024 సమ్మర్ మాత్రమే. ఎలాగూ సమ్మర్ టార్గెట్ గా పెద్ద సినిమాలు ఏవీ లేవు.
పుష్ప ఎప్పటికి?
2024 లో సినిమా అభిమానులు వేచి చూస్తున్న మూడు సినిమాల్లో ప్రాజెక్ట్ కే సంగతి తేలింది. రామ్ చరణ్-శంకర్ సినిమా సంగతి తేలాలి. ఒకటి సంక్రాంతి ఇంకోటి సమ్మర్ అనుకుంటే మరి పుష్ప సంగతి ఏమిటి? అన్న సందేహం వుండనే వుంటుంది. దానికీ సంక్రాంతి-సమ్మర్ కావాలో లేక 2023 డిసెంబర్ కే బరిలోకి దిగుతుందో.
ఇదిలా వుంటే ఈ ఏడాది దసరాకు మహేష్ బాబు మూవీ, ఇంకా బాలయ్య సినిమా వుంటాయి. ఎన్టీఆర్-కొరటాల సినిమా ఎప్పుడు అన్న ప్రశ్న లేదు. ఎందుకంటే ఇంకా బిగిన్ కావాల్సి వుంది ఆ సినిమా.