Advertisement

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజు - మరో భారీ ప్రాజెక్టు

దిల్ రాజు - మరో భారీ ప్రాజెక్టు

నిర్మాత దిల్ రాజు మాంచి స్పీడ్ మీద వున్నారు. భారీ భారీ సినిమాలు టేకప్ చేస్తున్నారు. 

విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఒకటి, శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో మరొకటి సెట్ మీద వున్నాయి. ఇంద్రగంటి-విజయ్ దేవరకొండ ప్లానింగ్ లో వుంది. ఇప్పుడు మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

కేజిఎప్ 2 తో సంచలనాలు నమోదు చేసిన హీరో యష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు అన్నది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఈ సినిమా చాలా భారీగా పాన్ ఇండియా లెవెల్ లో తీస్తారు.

ప్రస్తుతానికి యష్ తరువాత సినిమా ఏమిటన్నది క్లారిటీ లేదు. హంబులే ఫిలింస్ వారు చేస్తారా? లేక దిల్ రాజు చేస్తారా? అన్నది క్లారిటీ రావాల్సి వుంది. దిల్ రాజు బ్యానర్ లో అయితే ఓ సినిమా ఫిక్స్ అయిందన్నది వాస్తవం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?