ఆకాష్ పూరి కథానాయకుడిగా తయారవుతున్న సినిమా చోర్ బజార్. హైదరాబాద్ లో వినిపించే పేరు చోర్ బజార్. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ బజార్ నేపథ్యంలో కథ రాసుకున్నట్లు కనిపిస్తోంది.ఆకాష్ పూరి తన తండ్రి, దర్శకుడు పూరి స్టయిల్ హీరో క్యారెక్టరైజేషన్ నే మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.
డైలాగులు కూడా అదే స్టయిల్ లో వున్నాయి. ట్రయిలర్ అంతా పూరి స్టయిల్ హీరో, హీరోయిన్ ట్రాక్ ను చూపించి, తరువాత థ్రిల్లర్ టచ్ లోకి మార్చారు. సునీల్ మరో కీలకపాత్రలో కనిపించాడు. గెహాన సిప్పీ కథానాయిక. యూత్ ను ఆకట్టుకునేలా ట్రయిలర్ ను కట్ చేసి వదిలారు.
చోర్ బజార్ ట్రైలర్ లో హీరో ఆకాష్ పూరి బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక దూల ఉంటుంది. నాకు చేతి దూల. 20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా నా దిల్ కా దఢకన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటూ ఆకాష్ చెప్పిన డైలాగ్స్ ట్రయిలర్ లో వదిలారు.
ఈ ట్రయిలర్ ను హీరో బాలకృష్ణ విడుదల చేసారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…చోర్ బజార్ ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. పైసా వసూల్ సినిమా నుంచి పూరి జగన్నాథ్ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది.
ఆకాష్ పూరి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు. మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే. కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గినా ఆ తర్వాత మళ్లీ మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. కొత్తగా, భిన్నంగా ఉన్న చిత్రాలకు అందరి ఆదరణ తప్పకుండా ఉంటుంది. చోర్ బజార్ కూడా అలాంటి కొత్త తరహా సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.
ఐవి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద విఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అల్లూరి సురేష్ వర్మ సహనిర్మాత.