కేవలం 17 రోజుల్లో 3 కిలోలు తగ్గింది

హీరోయిన్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో వెయిట్ ఒకటి. బరువు పెరిగితే అవకాశాలు తగ్గిపోయే రోజులివి. మామూలుగానే డింపుల్ హయతి కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. ఈమధ్య ఈ బొద్దుగుమ్మ ఇంకాస్త బరువు పెరిగింది. Advertisement…

హీరోయిన్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో వెయిట్ ఒకటి. బరువు పెరిగితే అవకాశాలు తగ్గిపోయే రోజులివి. మామూలుగానే డింపుల్ హయతి కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. ఈమధ్య ఈ బొద్దుగుమ్మ ఇంకాస్త బరువు పెరిగింది.

దీంతో పెరిగిన బరువును తగ్గించేందుకు తనకుతానే జిమ్ ఛాలెంజ్ తీసుకుంది ఈ బ్యూటీ. ఏకథాటిగా 17 రోజుల పాటు జిమ్ లో కసరత్తులు చేసి ఒక్కసారిగా 3 కిలోలు తగ్గింది. 17 రోజుల్లో 3 కిలోలు తగ్గడమంటే సాధారణ విషయం కాదు. వెయిట్ లాస్ కోసం కసరత్తులు చేసేవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. 3 కిలోలు తగ్గిన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది డింపుల్.

రీసెంట్ గా ఆమె కొత్త సినిమాల్లో కనిపించడం లేదు. ఖిలాడీ, రామబాణం తర్వాత డింపుల్ సందడి తగ్గింది. ఆ తర్వాత ఓ పోలీస్ అధికారితో గొడవ పడి వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత ఓ పూజారితో ప్రత్యేక పూజలు చేయించుకొని మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.

ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అందుకే ఇలా వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంది. రామబాణం సినిమా ఈ తెలుగమ్మాయికి కలిసిరాలేదు