30 సెకెన్లలో కథ మొత్తం చెప్పేశాడు

రెండున్నర గంటల సినిమా కథను అర నిమిషంలో చెప్పడం సాధ్యమా. ఎవరికైనా అసాధ్యం అనిపిస్తుంది. కానీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాత్రం తన సినిమా కథను జస్ట్ 30 సెకెన్లలో చెప్పేశాడు.  Advertisement నితిన్…

రెండున్నర గంటల సినిమా కథను అర నిమిషంలో చెప్పడం సాధ్యమా. ఎవరికైనా అసాధ్యం అనిపిస్తుంది. కానీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాత్రం తన సినిమా కథను జస్ట్ 30 సెకెన్లలో చెప్పేశాడు. 

నితిన్ హీరోగా ఇతడు చేస్తున్న చెక్ సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో సినిమా కథ మొత్తం చెప్పేశాడు దర్శకుడు. హీరో ఆదిత్యను పోలీసులు టెర్రరిస్ట్ అంటారు. కోర్టు కూడా అదే నమ్ముతుంది. 

అతడికి ఉరిశిక్ష విధిస్తుంది. కానీ హీరోకు ఓ అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. అదే ఛెస్. చదరంగం ఆడడంలో విశ్వనాధన్ ఆనంద్, కాస్పరోవ్ కు ఏమాత్రం తీసిపోడు ఆదిత్య. మరోవైపు అతడు నిరపరాధి అని వాదిస్తుంటుంది లాయర్ రకుల్. జైలు నుంచే చదరంగంతో హీరో ఎలా గుర్తింపు తెచ్చుకుంటాడు.. ఉరిశిక్ష నుంచి ఎలా బయటపడ్డాడనేది ఈ సినిమా స్టోరీ.

ఎందుకో సినిమా ప్రచారం ప్రారంభించినప్పట్నుంచి కథ విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయడం లేదు మేకర్స్. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే నితిన్ ను ఉరిశిక్ష పడ్డ ఖైదీగా చూపించారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫొటోల్లో రకుల్ ను లాయర్ గా, ప్రియాప్రకాష్ వారియర్ ను నితిన్ కు లవర్ గా చూపించారు.

కథ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేయకుండా, ప్రేక్షకుల్ని మెంటల్లీ ప్రిపేర్ చేయడం కోసమే ఈ ఎత్తుగడ ఎత్తుకున్నట్టుంది. ఈ సంగతులన్నీ పక్కనపెడితే.. దర్శకుడు ఎప్పట్లానే మరోసారి టిపికల్ స్టోరీలైన్ ను తలకెత్తుకున్నాడనిపిస్తోంది.