Advertisement

Advertisement


Home > Movies - Movie News

గుండెపోటుతో డైరెక్టర్ మృతి!

గుండెపోటుతో డైరెక్టర్ మృతి!

కన్నడ సినీ రంగంలో విషాదం నెల‌కొంది. కన్నడ చిత్ర దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ రోజు త‌న‌ ఆఫీసులో గుండెపోటుకు గురికావ‌డంతో సిబ్బంది ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.  

శాండల్‌వుడ్ లో సంచారి, ప‌య‌న‌, పారు వైఫ్ ఆఫ్ దేవ‌దాస్, యారిగే యారింటు లాంటి సినిమాల‌కు కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో కూడా తిరుగుబోతు అనే మూవీని తెరకెక్కించారు. 

కిరణ్ గోవి స్వస్థలం తుమకూరు. కానీ అతని విద్యాభ్యాసం బెంగళూరులో జరిగింది. చదువులో వెనుకబడి ఉండటంతో కిరణ్ ఆర్కెస్ట్రాలో చేరి పాడటం ప్రారంభించాడు. కిర‌ణ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?